కొమ్మాల జాతరకు ఏర్పాట్లు పూర్తి


Wed,March 20, 2019 02:53 AM

-రేపు బండ్లు తిరుగుటతో జాతర ప్రారంభం
గీసుగొండ, మార్చి 19 : మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 21 హోలీ పర్వదినం సందర్భంగా రాత్రి 10 గంటలకు స్వామి వారి బండ్లు తిరుగుట కార్యక్రమంతో జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. జాతరకు వివిధ ప్రాతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం భారీ క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు దీంతో పాటు భక్తులు ఉండేందుకు ఆలయ ప్రాంగణంలో ధర్మసత్రంను సిద్ధం చేయడంతో పాటు చలువ పందిళ్లను వేశారు. జాతర ప్రాంతంలో పోలీసులు 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వరంగల్ నర్సంపేట ప్రధాన రోడ్డు నుంచి జాతరకు వచ్చే రోడ్డును చదును చేశారు. వాహనాలు లోపలికి, బయటకు వెళ్లే దారి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా జాతర ప్రాంగణంలోని నాలుగు వాటర్ ట్యాంకులను నిత్యం నీటితో నింపుతున్నారు. జాతర ప్రాంతమంతా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. మంగళవారం స్వామి వారికి అర్చకులు నిత్యహోమం, బలిహారణాదుల సేవలు నిర్వహించారు. అనంతరం సింహవాహనంపై గుట్ట చూట్టు ఊరేగించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...