చంద్రగిరిపై కొలువుదీరిన చెన్నకేశవస్వామి


Wed,March 20, 2019 02:53 AM

దామెర, మార్చి 19: మండలంలోని కోగిల్వాయి శ్రీచంద్రగిరి చెన్నకేశవస్వామి జాతర మంగళవారం రాత్రి వైభవ ంగా ప్రారంభమైంది. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య చంద్రగిరి గుట్టపై ఉన్న ఆలయానికి స్వామివారు బయలుదేరి వెళ్లారు. మొదటగా ఆలయంలో శ్రీదేవి, భూదేవి సహితంగా కొలువై ఉన్న శ్రీచెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన అర్చకులు దివి వెంకటజోగాచార్యులు, మురళీధరాచార్యులు, కేశవాచార్యులు, నర్సింహాచార్యులు తదితరులు పుష్పాలు, పట్టువస్త్రాలతో అలంకరించి,ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను సర్పంచ్ గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ముఖ్య కూడలిలో సాంప్రదాయ పద్ధతిలో కర్రలను కాల్చారు. భక్తజన సందోహం మధ్య స్వామివారు గుట్టపైకి చేరుకుని ఆలయంలో కొలువుదీరారు. ఈ మేరకు జాతర ప్రారంభమైనట్లు సర్పంచ్ ప్రకటించారు.

జాతర పోస్టర్ ఆవిష్కరణ
మండలంలోని కోగిల్వాయి చంద్రగిరి చెన్నకేశవస్వామి జాతర పోస్టర్‌ను ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపల్లి ధర్మారాజు స్థానిక సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ చంద్రగిరి చెన్నకేశవస్వామి ఎంతో మహిమగల దేవుడన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించామన్నారు. 21న జరిగే కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోల్కొండ సాంబయ్య, గట్ల అజయ్‌రెడ్డి, అమ్ముల రాజు, వార్డు సభ్యులు సంజీవ్, ప్రభావతి శ్రీనివాస్, గుండా రజనీచంద్రమోహన్, జంగిలి నాగరాజు, బిక్షపతి, సుజాత సంపత్, గోనెల కుమార్, పున్నం నాగరాజు, లావణ్య వేణు, సంగనబోయిన కిరణ్, మాజీ సర్పంచ్ పాకాల రంగారెడ్డి, గోల్కొండ రవి, పర్శబోయిన జయశంకర్, సమ్మయ్య, రాజేష్, వెంకటేశ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జకీర్‌అలీ, ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల శంకర్, సర్పంచ్‌లు పుల్యాల రఘుపతిరెడ్డి, కుక్క శ్రావణ్య అనీల్, పున్నం రజితసంపత్, కేతిపల్లి సరోజనవీరారెడ్డి, ఉప్పుల రజితసత్యం, బింగి రాజేందర్, ఎంపీటీసీలు కమలాకర్, సుమలత, రమేశ్, మేకల సంపత్, ఉపసర్పంచ్ గోల్కొండ సాంబయ్య, నాయకులు నాగరాజు, సంజీవ్, ప్రభావతి శ్రీనివాస్, కేతిపల్లి శ్రీధర్‌రెడ్డి, అనీల్, సిలివేరు నర్సయ్యపాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...