మిషన్ భగీరథ కార్యాలయాల్లో


Wed,March 20, 2019 02:52 AM

-మానిటరింగ్ సెల్ ఏర్పాటు
-జిల్లా సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఈశ్వర్
రూరల్ కలెక్టరేట్, మార్చి 19 : మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ (ఇంట్ర) వరంగల్ రూరల్ సర్కిల్ కార్యాలయం, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్ రూరల్ జిల్లా కార్యాలయం, కార్య నిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ (ఇంట్ర) డివిజన్ మహ బూబాబాద్ జిల్లా కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు మిషన్ భగీరథ వరంగల్ రూరల్ జిల్లా సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఎస్.ఈశ్వర్ తెలిపారు. ఈ మానిటరింగ్ సెల్ విభాగం ఈ నెల 22వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథకు సంబంధించిన నీటి సమస్యలు ఉంటే ప్రజలు మానిటరింగ్ సెల్ విభాగానికి సమాచారం ఇవ్వాలని మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ వరంగల్ రూరల్ సర్కిల్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పర్యవేక్షక ఇంజనీర్ మిషన్ భగీరథ వరంగల్ రూరల్ సర్కిల్ ఎస్.ఈశ్వర్ (0870-2623666), కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ (ఇంట్ర) డివిజన్ వరంగల్ రూరల్ జిల్లా అధికారి ఎం ఆనంద్ (7095363399), కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ (ఇంట్ర) డివిజన్ మహబూబాబాద్ జిల్లా అధికారి ఏ రాజ్‌కుమార్ (08719-298399)ను సంప్రదిం చాలని ఆయన సూచించారు

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...