లయన్స్‌క్రికెట్ ఫైనల్ విజేత వల్లభ్‌నగర్ జట్టు


Wed,March 20, 2019 02:52 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ : లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నెల రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్‌లో వల్లబ్‌నగర్ జట్టు గెలుపొందింది. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఫైనల్‌కు వల్లభనగర్, మచ్చాపూర్ టీంలు చేరాయి. ఈ రెండు టీంల మధ్య ఫైనల్ మ్యాచ్ మంగళవారం నర్సంపేటలోని మినీ స్టేడియంలో జరిగింది. దీనిలో లయన్స్‌క్లబ్ జోనల్ చైర్మన్ డాక్టర్ భరత్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. నెల రోజుల పాటు జరిగిన పోటీల్లో ఫైనల్‌లో రూ.10 వేల నగదు, రెండో బహుమతి రూ. 5 వేల నగదు, బెస్ట్‌బౌలర్‌కు రూ. వెయ్యి, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌కు రూ.వెయ్యి నగదు ఇస్తామని తెలిపారు. మ్యాచ్‌లో ఆడిన క్రీడాకారులకు మెమొంటోలు, మెడల్స్‌ను అందిస్తున్నట్లు వివరించారు. యువకులలో ఉత్తేజం నింపడానికి, క్రీడాకారులను ప్రొత్సహించడానికి ఈ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సేవాగుణం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుభాష్, కల్యాణ్, రాము తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...