పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలి : సీడీపీవో పద్మ


Wed,March 20, 2019 02:52 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : పోషకాహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వర్ధన్నపేట సీడీపీవో పద్మ సూచించారు. మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో పోషణ పక్షంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు పోషణపక్షం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగానే అన్ని వర్గాల ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పిల్లలకు పోషకాహారంపై సమగ్రంగా వివరిస్తున్నామని చెప్పారు. పిల్లలు అందుబాటులో దొరికే రోజు ఒక పండు చొప్పున తినిపించాలని అన్నారు. అలాగే ఆకు కూరలు, పప్పులు, మజ్జిగ, ఇతర అందుబాటులో ఉండే ఆహార పదార్థాలను విధిగా ఇవ్వాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని 0-5 ఏళ్లలోపు పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు అందించేలా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...