పూల రవీందర్‌తోనే విద్యారంగానికి మేలు


Wed,March 20, 2019 02:52 AM

రాయపర్తి, మార్చి 19 : వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా బరిలో ఉన్న పూల రవీందర్‌ను మరోసారి గెలిపిస్తేనే ఉపాధ్యాయ, విద్యారంగాలకు ఆశించిన మేలు జరుగుతుందని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మైలారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీగా పూల రవీందర్ గెలుపు కోరుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పూల రవీందర్ ఎమ్మెల్సీగా పని చేసిన కాలంలోనే ఉపాధ్యాయులకు అవసరమైన అనేక జీవోలను ప్రభుత్వంతో జారీ చేయించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సుధీర్ఘ కాలం పాటు పని చేసిన రవీందర్‌ను ఉపాధ్యాయులు మరోమారు సంఘాలకు అతీతంగా గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు వట్నాల సత్యనారాయణ, పున్నం అంజయ్య, ఉపాధ్యాయులు రావుల భాస్కర్‌రావు, నక్క మాధవి, పీ.శ్రీనివాస్‌గుప్తా, కరుణాకర్‌రెడ్డి, పున్నం కుమారస్వామి, ప్రవీణ, రజిని, మైస శ్రీనివాస్, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...