దేశానికి కేసీఆర్ విజన్ కావాలి


Tue,March 19, 2019 03:40 AM

-పాకాలకు కృతజ్ఞతగా కారుకు ఓటేయాలి
-నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ రావాలి
-నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఖానాపురం, మార్చి 18 : నీళ్లు, విద్యుత్, ఆరోగ్యం, విద్యా, ఉపాధి, పారిశ్రామిక విధానంలో దేశానికి కావాల్సింది కేసీఆర్ విజనేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం వేములపల్లి ప్రకాశ్‌రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నేడు అన్ని రాష్ర్టాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇన్నేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం ఎంతో వెనకబాటుకు గురైందన్నారు. కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను టీఆర్‌ఎస్ గెలుచుకుంటే కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కేసీఆర్ ఉంటే ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తారన్నారు. దీంతో ప్రతి ఎకరాకు 60 టోకెన్లు వస్తాయని తద్వారా రైతులకు రూ.12వేల పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. రైతులకు మేలు జరిగితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు చేరువైందన్నారు. ఈ ప్రాంతాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చేయలేని పనిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలోనే చేసిందన్నారు. చారిత్రక పాకాలకు కొత్త చరిత్రను తిరగరాసి శాశ్వత జలాలు కల్పించిందన్నారు. అందుకే పాకాల రైతులు కృతజ్ఞతగా కారు గుర్తుకే ఓటెయ్యాలన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించే బాధ్యతను కేసీఆర్ తనకు అప్పగించారన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 9 వేల మెజార్టీ వచ్చిందన్నారు. కానీ గెలిచిన ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ బలం పెంచుకుందన్నారు. అభ్యర్థి ఎవరైనా సరే టీఆర్‌ఎస్ పార్టీ గెలవాలన్నారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో 50 వేల మెజార్టీ సాధించాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో 20 జీపీలకు 19 గెలుచుకుని జిల్లాలో ఖానాపురం మండలం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అదేస్ఫూర్తితో మరింత కష్టపడి ఎంపీ ఎన్నికల్లో అధిక మెజార్టీ సాధించాలన్నారు. మంగళవారిపేట, దబీర్‌పేట రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్ట్టికి తీసుకుపోయానన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.

సర్పంచ్‌లకు ఎమ్మెల్యే సన్మానం
మండలంలో ఇటీవల గెలిచిన 19 మంది సర్పంచ్‌లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సర్పంచ్‌లు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సన్మానం పొందిన వారిలో గొర్రె కవిత, నీలమ్మ, హట్య, అశోక్, ప్రవీణ్‌కుమార్, బూస రమ, లావుడ్య రమేశ్, గుగులోత్ సు మన్, పద్మ, పద్మావతి, బాలకిషన్, గుగులోత్ తారమ్మ, సోమయ్య, నరేశ్, సునీత తదితరులు ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్ నాయకుడు ఆబోతు రాజుయాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో ఆబోతు అశోక్‌యాదవ్‌తో పాటు 30 మంది, అలాగే, మంగళవారిపేట సర్పంచ్ లావుడ్యా రమేశ్, నాజీతండాకు చెందిన ఫరీద్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ దబ్బెట ఉపేందర్‌తో పాటు 35 మంది ఉన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, మండల నాయకులు మహాలక్ష్మీ వెంకటనారాయణ, గుగులోత్ రామస్వామి నాయక్, కొలిశెట్టి పూర్ణచందర్‌రావు, మౌలానా, ఉపేందర్‌రెడ్డి, జేరిపోతుల వెంకటేశ్వర్లు, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.

నల్లబెల్లి మండలంలో..
నర్సంపేట,నమస్తేతెలంగాణ : ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లబెల్లి మండల కార్యకర్తలు, నాయకు లు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలవడం వల్ల ఢిల్లీలో టీఆర్‌ఎస్ చక్రం తిప్పే అవకాశం ఉం టుందన్నారు. దీంతో తెలంగాణ ప్రాం తానికి అధిక నిధులు వస్తాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో గులాబీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అం దించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎం తో కృషి చేస్తున్నారన్నారు. మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఎంపీ ని గెలిపించుకునేలా పట్టుదలతో పనిచేయాలని సూచించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్, ఎంపీపీ సారంగపాణి, కక్కెర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...