గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి


Tue,March 19, 2019 03:38 AM

-పరకాల ఐసీడీఎస్ సీడీపీవో స్వర్ణలత
పరకాల, నమస్తే తెలంగాణ : గర్భిణులు, బాలింతలు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పరకాల ఐసీడీఎస్ సీడీపీవో స్వర్ణలత అన్నారు. సోమవారం నడికూడ మండలంలోని చర్లపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార అభియాన్‌లో భాగంగా పోషణ పక్షం, గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీడీపీవో మాట్లాడుతూ పోషణ పక్షం వారోత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు , బాలింతలు ప్రతిరోజు ఐరన్, విటమిన్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పప్పుదినుసులు, పండ్లు, కూరగాయలు తినాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అంగన్‌వాడీలో ఒకపూట భోజనం చేయాలని చెప్పారు. అనంతరం పోషణపక్షం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో రమాదేవి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు అరుణ, సుజాత, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయుడు విజేందర్‌రెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు అరుణ, లక్ష్మి, సంధ్యారాణి, సరిత, మంజుల, ఆరోగ్యకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...