తొలి నామినేషన్ దాఖలు


Tue,March 19, 2019 03:38 AM

-బీఎస్పీ అభ్యర్థి బరిగల శివ
-వివరాలు అందజేయాలని ఆర్‌వో నోటీసు జారీ
-నామినేషన్ల స్వీకరణకు భారీ బందోబస్తు
-లోపలకు ఐదుగురికి మాత్రమే అవకాశం
-19,20,22,25 తేదీలు మాత్రమే పనిదినాలు
అర్బన్ కలెక్టరేట్, మార్చి 18: వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గానికి తొలి నామినేషన్ దాఖలైంది. సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంతో అదే రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. మొదటి ఒక నామినేషన్ దాఖలైందని రిటర్నింగ్ అధికారి, వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. బరిగల శివ బహుజన సమాజ్‌వాది పార్టీ(బీఎస్‌పీ) అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు పార్టీ బి-ఫారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలు, అఫిడవిట్, నేరచరిత్ర వివరాలు అందజేయాలని బరిగల శివకు రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అఫిడవిట్ ఫారం -26 ద్వారా ఇచ్చిన భార్య, భర్త అభ్యర్థిపై ఆధారపడి జీవిస్తున్న వారి ఆస్తులు, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలు, క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈసీఐ వెబ్‌సైట్ నందు ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే వాటి ప్రతులను రిటర్నింగ్ అధికారి చాంబర్ ఎదుట కలెక్టరేట్‌లోని కాంప్లెక్స్‌లో ఉన్న మీడియా సెంటర్‌లో నోటీసు బోర్డులో డిస్‌ప్లే చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నామినేషన్ల స్వీకరణకు భారీ బందోబస్తు
సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు, లోపల భారీబందోబస్తు ఏర్పాటు చేశామని ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. ము ఖ్యంగా కలెక్టరేట్ బయట బారికేడ్లతో పాటు పోలీసుబందోబస్తు ఏర్పాటు చే స్తూ, పనుల నిమిత్తం కలెక్టరేట్‌లోకి వచ్చే వారిని పూర్థి స్థాయిలో విచారణ చేసి పంపిస్తామని చెప్పారు. అలాగే రిటర్నింగ్ ఆపీసర్ చాంబర్ ఎదుట రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. 15-వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఉన్న ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచామని చెప్పారు. రిసెప్షన్ సెల్ ద్వారా అభ్యర్థులకు నామినేషన్ పత్రం పూర్తి చేసేందుకు అవసరమైన సూచనలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాకరించాలని కోరారు. ఈ నెల 19, 20, 22,25 తేదీలు మాత్రమే పనిదినాలని, ఆయా తేదీల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రశాంత్‌జీవన్ పాటిల్ సూ చించారు. నామినేషన్ పత్రాలను రిసెప్షన్ సెంటర్ నుంచి ముందుగా తీసుకుని అవసరమైన పత్రాలను జతపరిచి సక్రమంగా పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి అందజేయాలని ఆయన తెలిపారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...