సంక్షేమ బడ్జెట్


Sat,February 23, 2019 03:19 AM

-ఇచ్చిన మాటకు కట్టుబడి కేటాయింపులు
-వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట
-ప్రతీ సంక్షేమ, అభివృద్ధి పథకానికి సమృద్ధిగా కేటాయింపులు
-లబ్ధిపొందునున్న పింఛన్‌దారులు 96,498
-లబ్ధిపొందనున్న రైతులు 13,39,649
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌పై జిల్లాలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సబ్బండవర్గాల సంక్షేమంతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. 2019-20 సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ప్రజామోదయోగ్యంగా పద్దులు ఉండడంతో జిల్లాలోని అన్ని సెక్షన్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశంలోనే తెలంగాణను రోల్‌మోడల్‌గా చూస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా సంక్షేమ పథకం అందని కుటుంబం లేదన్నారు. దీంతో ప్రజలు మేలు పొందుతూ టీఆర్‌ఎస్‌ను రెండోసారి కూడా ఆశీర్వదించారని, మరోసారి ఈ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. 2018-19లో తెలంగాణ వృద్ధిరేటు కూడా చాలా బాగుందన్నారు.

ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లను రెట్టింపు చేయడం, దివ్యాంగుల పింఛన్లను పెంచడంతో జిల్లాలో 96,498 మంది పింఛన్లు పొందుతుండగా వీరిలో 38,636 మంది వృద్ధులు, 1,508 మంది చేనేత 13,403 మంది వికలాంగులు, 35,248 మంది వితంతువులు, 32,037 మంది కల్లుగీత కార్మికులు, 2,046 మంది బీడీ కార్మికులు, 2,423 మంది ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారు. వీరందరికీ పింఛన్లను రెట్టింపు చేస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో మరింత లబ్ధిచేకూరనుంది. పెన్షనర్ల వయస్సును 65 నుంచి 57కు తగ్గింపు చేయడం, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కోసం నిధులు, ఇచ్చిన హామీని నిలుపుకునే క్రమంలో నిరుద్యోగభృతి కోసం నిధులను కేటాయించి విధివిధానాలను రూపకల్పన చేసేలా ఆదేశించడంపై జిల్లావాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి నిధులు కేటాయించి ఏడాదికి రూ.8 వేల సాయాన్ని రూ.10 వేలకు పెంచడం, ఈ పథకం ద్వారా 13,39,649 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతు రుణమాఫీకి, రైతు బీమా కోసం నిధులు, వ్యవసాయ రంగానికి రూ.20,107 కోట్లు కేటాయించి పెద్దపీట వేశారు.

దీంతో జిల్లాలోని రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సీడీలు అందనున్నాయి. ఆరోగ్యశాఖకు నిధులు కేటాయించడంతో జిల్లాలోని 145 ఉప ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు కమ్యూనిటీ ఆస్పత్రుల పరిధిలో విస్తృత సేవలు అందించడంతోపాటు ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాల ప్రగతి, త్వరలో నిర్వహించబోయే ఈఎన్‌టీ శిబిరాలతో జిల్లాలోని ఆరున్నర లక్షల మంది ప్రజలకు లబ్ధిచేకూరే అవకాశముంది. షెడ్యూల్ కులాల ప్రగతినిధి, మైనారిటీల సంక్షేమం, బియ్యం రాయితీ కోసం కేటాయించిన నిధుల మూలంగా సన్నబియ్యంతో మూడు పూటలా కడుపునిండా తింటూ మధ్యాహ్న భోజన విద్యార్థులు, వసతి గృహాల విద్యార్థులు విద్యారంగంలో ముందుకుసాగుతున్నారు. నాణ్యమైన భోజనం అందించడం వల్ల జిల్లాలోని 669 ప్రభుత్వ పాఠశాలల్లో 40,906 మంది విద్యార్థులు పగటిపూట భోజనాన్ని పాఠశాలల్లోనే పౌష్టికాహారంగా తీసుకుంటున్నారు. ఇక కేజీబీవీలు, వసతిగృహాల్లో కూడా సన్నబియ్యంతో భోజనం చేసే అవకాశాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పించింది.

ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు, మిషన్ కాకతీయకు నిధులతోపాటు బీసీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పడం, పంచాయతీలకు 2వ ఫైనాన్స్ కమిషన్ల కింద నిధులు కేటాయించారు. దీంతో జిల్లాలోని 265 పంచాయతీలు, కొత్తగా ఏర్పడిన 136 పంచాయతీలు ప్రగతిపథంలో పయనించనున్నాయి. 500 జనాభా కలిగిన ప్రతీ గ్రామానికి రూ.8 లక్షల నిధులను కేటాయించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు, పరిశ్రమల ద్వారా ఉద్యోగాల భర్తీల కృషి, మిషన్ భగీరథ పనులకు కటాఫ్ డేట్ ప్రకటించి ఇంటింటికీ నీరిచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఏప్రిల్ మాసాంతానికల్లా జిల్లాలోని ప్రతీ గ్రామానికి గోదావరి జలాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బడ్జెట్‌లో ముఖ్యమంత్రి ఈ అంశాలను ప్రస్తావించడంతో సబ్బండ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రికి జేజేలు పలుకుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమతుల అభివృద్ధే లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ మరోసారి చరిత్రలో నిలిచిపోనుంది.

చెన్నారావుపేట : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయిం డం సంతోషంగా ఉంది. ఎస్సీల అ భ్యున్నతి కోసం రూ.16,581 కోట్లు, ఎస్టీల అభ్యున్నతికి రూ.9,827 కో ట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.2,00 4 కోట్లు కేటాయిండం చాలా గొప్ప నిర్ణయం. అంతేకాక నిరుద్యోగ భృతి రూ.1,810 కోట్లు కేటాయించి యువతకు పెద్ద పీట వేశారు.
- మురహరి వంశీకృష్ణ, అమీనాబాద్

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి అద్దం పట్టేలా బడ్జెట్
ఖానాపురం : అన్ని వర్గాల ప్రజలకు, పలు రంగాలకు సమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి అద్దం పట్టేలా సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అన్ని శాఖలకు నిధుల కేటాయింపు అద్భుతంగా ఉంది. వ్యవసాయ రంగంపై మరోమారు సీఎం తన మార్కును చూపారు. వ్యవసాయ రంగానికి అధిక నిధులను కేటాయిస్తూనే అన్ని రంగాలకు సమప్రాధాన్యతనిచ్చాడు. ఎస్టీలకు రూ.9,827 కోట్లను కేటాయించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపించేలా బడ్జెట్ ఉంది.
- గుగులోత్ రామస్వామినాయక్

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...