నైపుణ్యాలను పెంపొందించుకోవాలి


Sat,February 23, 2019 02:38 AM

నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 22 : విద్యార్థులు వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రముఖ టాస్క్ కంపెనీ ప్రతినిధి, రిసోర్స్ పర్సన్ బెన్సన్, బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్ అన్నారు. మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో బీటెక్ ఈఈఈ విద్యార్థులకు ప్రముఖ టాస్క్ కంపెనీ ఆధ్వర్యంలో శుక్రవారం పర్సనల్ స్కిల్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు సరైన మార్గాన్ని ఎంచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ పరిమితం కాకూడదన్నారు. ఇంటర్వ్యూలల్లో మాట్లాడే విధానాన్ని పెంపొందించుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ హరిహరన్, రిసోర్స్ పర్సన్ సతీశ్, డాక్టర్ అరుణ్ కోఆర్డినేటర్ రణధీర్ డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్ ఆఫీసర్ అల్లంకి సన్యాసిరావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్ ఆఫీసర్ డాక్టర్ నరేశ్, ఏవో సలేంద్ర సురేశ్, మేనేజర్ పెండ్యాల యాదగిరి, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...