చెన్నకేశవ ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు


Sat,February 23, 2019 02:37 AM

దామెర : మండలంలోని కోగిల్వాయి గ్రామంలోని శ్రీచంద్రగిరి గుట్టల్లో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో గుప్తనిధులకోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఆలయంలో స్వామి వారి కల్యాణ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. గత సంవత్సరం కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఆగుట్టలపైకి వెళ్లేవారు లేకపోవడంతో ఆసరగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధులకోసం తవ్వకాలు చేపట్టారని తెలుస్తోంది. మూలవిరాట్ శ్రీచెన్నకేశవస్వామి కొలువై ఉన్న మండపంలో తాబేలు బొమ్మకు ఎదురుగా ఈ తవ్వకాలు కొద్దిరోజుల క్రితం జరిపినట్లు అక్కడ ఉన్న అనావాళ్లను పట్టి తెలుస్తోంది. రెండు ఫీట్లమేర ఉండే మూడు బండరాళ్లను తొలగించి నాలుగు ఫీట్లవరకులోతుగా తవ్వకాలు చేశారు. రెండు సంవత్సరాల క్రితం కూడా ఈ గుట్టపై ఉన్న శివాలయంలో గుప్తనిధులకోసం తవ్వకాలు జరిపారు. ఈసారి ఏకంగా మూలవిరాట్ కొలువై ఉన్న మండపంలో గుప్తనిధులకోసం తవ్వకాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. తవ్వకం జరిపిన గుర్తు తెలియని వ్యక్తులకు గుప్తనిధులు దొరికాయా..దొరికితే ఎంత బంగారం దొరికింది అనేది తేలాల్సి ఉంది. దేవాదాయ, దర్మాదాయశాఖ అధికారులు గుప్తనిధుల తవ్వకాలపై తగిన విచరారణ చేపట్టాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...