పోలీస్ స్టేషన్ ఫిర్యాదు


Sat,February 23, 2019 02:35 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 22 : హాస్టల్ విద్యార్థులపై ఓ యువకుడి దాడిచేసి గాయపరిచిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. విద్యార్థుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని ఫిరంగిగడ్డకు చెందిన భాస్కర్ అనే యువకుడు గురువారం రాత్రి అతని స్నేహితుడి వివాహానికి కొందరు పక్కనే ఉన్న ఎస్టీ హాస్టల్ చెందిన విద్యార్థుల్ని తీసుకువచ్చి డ్యాన్స్ చేయించాడు. దీనిని గుర్తించిన 10వ తరగతికి చెందిన పలువురు విద్యార్థులు వచ్చి హాస్టల్ విద్యార్థులను హాస్టల్ తీసుకువెళ్లారు. దీంతో విద్యార్థులపై కక్ష పెంచుకున్న భాస్కర్ శుక్రవార మధ్యాహ్నం పాఠశాల నుంచి హాస్టల్ వెళ్తున్న సమయంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హాస్టల్ చెందిన విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈదాడిలో పవన్ గణేశ్, సురేశ్ అనే విద్యార్థులకు బలమైన గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానిక మహిళలు విద్యార్థులపై దాడి చేయకుండా అడ్డుకున్నప్పటికీ విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థులు వార్డెన్ ఏసోబుకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్థానిక పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన భాస్కర్ అనే యువకుడిని ఎస్సై స్టేషన్ తీసుకు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...