తండాల అభివృద్ధే ధ్యేయం..


Fri,February 22, 2019 01:57 AM

చెన్నారావుపేట : నియోజకవర్గంలోని తండాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లాయగూడెం శివారు చెరువు కొమ్ముతండా మీదుగా పదహారు చింతల్ తండా వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పెద్ది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడానికి ఎస్టీఎస్‌డీఎఫ్ గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఏటూరునాగారం నుంచి రూ.1.91కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ రోడ్డు పనులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ ప్రవీణ, ఏఈ చక్రధర్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, బానోతు శారదగణేష్, బోడ విజయబద్ధూనాయక్, మంద జయజనార్దన్, బోడ సమ్మునాయక్, తొగరు చెన్నారెడ్డి, భూక్య లింగంనాయక్, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, అమ్మ రాజేశ్, కడారి సాయిలు, బానోతు దేవ్‌సింగ్, సుక్యానాయక్, జున్నుతుల శ్రీధర్‌రెడ్డి, వీరస్వామి, కుసుమ నరేందర్, అడుప అశోక్, బోడ వెంకన్న, నూకల ముత్తయ్య, మద్దెబోయిన శ్రీధర్, ఎదురబోయిన సాంబయ్య, కందకట్ల రాజారాం, ఎదురబోయిన స్వామి, గంధం శ్రీనివాస్, కందికొండ అశోక్, మంచోజు మనోజ్ పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
మండలంలోని ఖాదర్‌పేట గ్రామానికి చెందిన విద్యార్థి అరిగెల యశ్వంత్ అనారోగ్యానికి గురికాగా దవాఖాన ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.33,500 మంజూరు కాగా, చెక్కును విద్యార్థి తండ్రి అరిగెల సంపత్‌కు ఎమ్మెల్యే పెద్ది అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుముల కుమారస్వామి, వార్డు సభ్యులు తోట రమేశ్, ఎరుకుల రాజ్‌కుమార్, నిలిగొండ రవీందర్ పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...