విద్యారంగానికి పెద్దపీట


Fri,February 22, 2019 01:56 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : విద్యా, వైద్యరంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఇల్లంద కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.1.35కోట్లతో నిర్మించనున్న అదనపు గదుల కోసం గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అమలులో భాగంగా కేజీబీవీల్లో ఇంటర్ వి ద్యను ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కేవలం ఇల్లంద కేజీబీవీలో మాత్రమే ఇంటర్ విద్య ప్రారంభమైనందున విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందన్నారు. వీటితో అదనపు గదులు నిర్మిస్తునట్లు ఆయన తెలిపారు.

ప్రజల రక్షణ కోసం ఫైర్‌స్టేషన్
వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినా వెంటనే సహాయం అందించడం కోసం నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ఫైర్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అన్ని వతులను కల్పిస్తుందన్నారు. త్వరలోనే ఇల్లంద గ్రామ పెద్ద చెరువులోకి నీటిని మళ్లించడం కోసం కాల్వలను పరిశీలించి అవసరమైన పనులు చేపడుతామన్నారు. అలాగే నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలీటీ, తండాల అభివృద్ధి కోసం రూ.20కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ సారంగపాణి, ఏసీపీ మధుసూదన్, జీసీడీవో సంధ్యారాణి, ఎంపీడీవో కల్పన, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు గొడిశాల శ్రీనివాస్, తోటకూరి రాజమణి, లక్ష్మి, అన్వర్, మార్గం భిక్షపతి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...