ఆకాశమే హద్దుగా..


Fri,February 22, 2019 01:56 AM

వరంగల్ స్పోర్ట్స్, ఫిబ్రవరి 21: ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు ఓరుగల్లు పర్వతారోహకుడు రాసమల్ల అఖిల్. మైనస్ 20డిగ్రీల ఉష్ణోగ్రతలో 5,895 మీటర్ల ఎత్తు(19340 అడుగులు)ఉన్న ఈపర్వతాన్ని అధిరోహించాడు..

వారి ప్రేరణతోనే పర్వతారోహణకు..
ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృస్టించిన తెలంగాణ రాష్ట్ర పర్వతారోహకులు ఆనంద్‌కుమార్, పూర్ణలతో గతంలోనే స్నేహసంబంధాలున్న అఖిల్ వారి ప్రేరణతోనే కిలిమంజారో అధిరోహించాడని అఖిల్ తండ్రి రవీందర్ చెప్పుకొచ్చారు. కిలిమంజారో పర్వతారోహణ చేయాలంటే దాదాపు 8 నుంచి 10రోజులు సమయం పడుతుందని నిష్ణాతుల అంచనా. కానీ అఖిల్ 15వతేదీన పర్వతారోహణ మొదలుపెట్టగా 20తేదీన పర్వతారోహణ పూర్తిచేసినట్లు తనకు సందేశం పంపినట్లు తండ్రి వివరించారు.

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం ఎంత సాహసోపేతమైన విషయమో అంతకుతగ్గ ఖర్చుతో కూడుకున్నది. తన కుమారుడికి ప్రపంచంలో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అందుకు కావాల్సిన డ బ్బును సమకూర్చే సమయంలో రూ. 3లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని తండ్రి రవీందర్ చెప్పుకొచ్చారు. వరంగల్‌రూరల్ జిల్లాలోని దుగ్గొండి మండలానికి చెందిన అఖిల్ కుటుంబం 22ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడింది. ఆటోడ్రైవర్‌గా రవీందర్ పనిచేస్తుండగా తల్లి కోమల ఓ ప్రైవేట్ హాస్టల్‌లో వర్కర్‌గా పనిచే స్తూ కుటుంబ పోషణకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వీరిలో అఖిల్ పెద్దవాడు.

అఖిల్ కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికైన విషయం తెలియగానే చిలువేరు శంకర్, అర్బన్ జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ వంటి ప్రజాప్రతినిధులు తగిన ప్రోత్సాహాన్ని అందజేశారు.

నేటి సాయంత్రం రాష్ట్రానికి అఖిల్..
పర్వతారోహణ పూర్తిచేసుకుని ఆఫ్రికా నుంచి తిరుగు పయనం అయిన అఖిల్ శుక్రవారం సాయంత్రానికి రాష్ర్టానికి వస్తారని అఖిల్ కుటుంబ సభ్యులు చెప్పారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...