నర్సరీ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఎంపీడీవో


Thu,February 21, 2019 03:19 AM

సంగెం: మండలంలోని వన నర్సరీల్లో బ్యాగులు నింపే పనులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీవో మల్లేశం అన్నారు. మండలంలోని షాపురం, రాంచంద్రాపురం నర్సరీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులపై కూలీలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు తొమ్మిది రకాల విత్తనాలు చేరాయని వాటిని ఆయా గ్రామ నర్సరీల్లో బ్యాగులు నింపాలన్నా రు. రాంచంద్రాపురం గ్రామంలో టేకు మొక్కలు మొలకెత్తాయని ఆయన చెప్పారు. మొక్కలు పెంచే సమయంలో కూలీలు మెలకువలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో శారద ఆయా గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...