ఎర్రబెల్లికి శుభాకాంక్షల వెల్లువ


Wed,February 20, 2019 02:29 AM

పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, నమస్తే తెలంగాణ/పర్వతగిరి/సంగెం/ రాయపర్తి/ గీసుగొండ/ శాయంపేట/ నెక్కొండ : రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పలువురు నాయకులు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేసే ముందు ఆయనను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా దయాకర్‌రావుకు మొదటి విడత మంత్రి వర్గంలో చోటు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.

అదేవిధంగా గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె బిక్షపతి, మాజీ ఎంపీటీసీ రేగూరి విజయపాల్‌రెడ్డి, రాయపర్తి మాజీ సర్పంచ్ పర్నెం తిరుపతిరెడ్డి, వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సిసురేశ్, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ సంపత్‌రెడ్డి కూడా ఎర్రబెల్లికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, టీఆర్‌ఎస్ పర్వతగిరి మండల అధ్యక్షుడు పల్లెపాటి శాంతిరతన్‌రావు నేతృత్వంలో మార్కెట్ డైరెక్టర్ బోయినపెల్లి యుగేందర్‌రావు, చింతనెక్కొండ ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్, గొర్ల మల్లయ్య, చీమల బిక్షపతి తదితరులు ఎర్రబెల్లిని పుష్పగుచ్ఛం అందజేశారు. గీసుగొండ మండలాధ్యక్షుడు చింతం సదానందం, సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, నాగేశ్వర్‌రా వు, మల్లయ్య, చిన్ని, అంగోతుకవిత, బాబు, నాయకులు గోలిరాజయ్య, ముంత రాజయ్య, కోల్పు ల కట్టయ్య, రవీందర్, మండ గోపాల్, మహబూబ్‌నాయక్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మాధవరెడ్డి కూడా మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. అలాగే, మాజీ స్పీకర్ ఓఎస్‌డీ గడ్డం భాస్కర్, ఎనుమాముల మార్కెట్ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మాజీ జెడ్పీటీసీ రాజస్వామి తదితరులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ రాయపర్తి మండల అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి, మునావత్ నర్సింహనాయక్, నాయకులు రంగు కుమార చిన్నాల రాజబాబు, భాషబోయిన సుధాకర్, గుగులోతు జాజునాయక్, భూక్య విజయ్‌కుమార్, గోవింద్‌నాయక్, నాగపురి అశోక్‌గౌడ్, పూస మధు కూడా ఎర్రబెల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ గూడ సుదర్శన్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలు చల్లా, పెద్దితో కలిసి వెళ్లి మంత్రి దయాకర్‌రావుకు పుష్పగుచ్ఛం అందజేశారు. నెక్కొండ ఎంపీపీ గటిక అజ య్‌కుమార్, వైస్ ఎంపీపీ సారంగపాణి కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...