నిరుద్యోగ మహిళలకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ


Wed,February 20, 2019 02:28 AM

హసన్‌పర్తి, ఫిబ్రవరి 19: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సంస్కృతి విహార్ ఎస్‌బీఐ ఆర్‌సెటీ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్‌భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఈ నెల 22వ తేదీ నుంచి 30 రోజులపాటు లేడీస్ టైలరింగ్, బ్యూటీపార్లర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, సంస్కృతి విహార్, టీటీడీసీ, హసన్‌పర్తి, వరంగల్ అర్బన్ జిల్లా 506371 చిరునామాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యంతోపాటు శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యతా సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 9704056522, 9849307873 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...