జైళ్లలో సంస్కరణలు తీసుకురావడం తొలిసారి


Wed,February 20, 2019 02:28 AM

-రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్
నయీంనగర్, ఫిబ్రవరి 19 : జైళ్ల శాఖలో సంస్కరణలు తీసుకరావడం దేశంలోనే మొదటిసారి అని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ పేర్కొన్నారు. హన్మకొండలోని పొలీస్ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జైళ్లశాఖకు దేశంలో మంచి ప్రత్యేకత ఉందని, ఈ మాటలు రాష్ట్ర జైళ్లశాఖ అధికారులు అంటున్నవి కాదని పలు రాష్ర్టాల అధికారులు, మేధావులు జైళ్లను సందర్శించి చెబుతున్న మాటలని చెప్పారు. ప్రతి ఒక్కరూ జైళ్లశాఖ పనితీరుపై కితాబు ఇస్తున్నారన్నారు. ప్రపంచంలోనే తెలంగాణ జైళ్లశాఖ ప్రత్యేకత చాటుకునేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేరాలకు మళ్లీ మళ్లీ పాల్పకుండా ఖైదీల్లో పరివర్తనం తీసుకొచ్చి జీవనోపాధి కల్పించామని తెలిపారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపుల్లో ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ నెలకు రూ.15 వేల వేతనం ఇస్తున్నట్లు వివరించారు. కొత్తగా అపరిమిత ములాఖత్, ఫోన్ కాల్స్‌ను కల్పించామని తెలిపారు. ఖైదీని ఖైదీలాగా చూడకుండా దేశ పౌరుడిగా చూస్తూ వారిలో మార్పులు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రూ.500 కోట్ల టర్నోవర్‌తో జైళ్ల శాఖ ఉందని, ఖైదీల సంక్షేమం కోసం పనుల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం చొరవ చూపితే సెంట్రల్ జైలు తరలింపుతోపాటు ఆనంద ఆశ్రమాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మురళీబాబు పేర్కొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...