నులి పురుగులను నివారించాలి


Wed,February 20, 2019 02:23 AM

నర్సంపేట : నులి పురుగులను నివారించాలని నర్సంపేట డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో వెంకటరమణ అన్నారు. మంగళవారం నర్సంపేట బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగులతో ప్రమాదం ఉంటుందని అన్నారు. పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. చేతులు శుభ్రంగా కడిగిన తర్వాతే భోజనం చేయాలని అన్నారు. నులిపురుగులను శరీరంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్య సంరక్షణ మన చేతుల్లోనే ఉందని తెలిపారు. నులిపురుగులతో పౌష్టికాహార లోపం ఏర్పడుతుందని, రక్తహీనతతో త్వరగా అలసిపోతారని అన్నారు. ఆరుబయట ఆహార పదార్థాలు తిన్నప్పుడు వాటి మీద ఉండే నులి పురుగులు కడుపులోకి చేరతాయని అన్నారు. ఇవి శరీరంలోని రక్తాన్ని పీల్చివేస్తాయని తెలిపారు. పిల్లలల్లో ఎక్కువగా రక్తహీనత ఉండడానికి కారణం ఇదేనని పేర్కొన్నారు. హెచ్‌ఎం వసుమతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...