విద్యార్థులు పరిశుభ్రత పాటించాలి : డీఎంహెచ్‌వో


Wed,February 20, 2019 02:23 AM

గీసుగొండ, ఫిబ్రవరి 19 : విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గీసుగొండ మండలం వంచనగిరి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే భోజనం చేయాలని సూచించారు. మనం తినే ఆహారంతోనే క్రిములు కడుపులోకి వెళ్లి అనారోగ్యానికి గురి చేస్తాయని అయన అన్నారు. ఆహారం ద్వారా శరీరంలో చేరిన క్రిములు అనేక రోగాలు రావడానికి దోహదం చేస్తాయన్నారు. 1 నుంచి19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ మాత్రలను ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని తెలిపారు. డీవార్మింగ్ మాత్రలు వేసుకోని పిల్లల్లో రక్తహీనత కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, జిల్లా వెల్ఫేర్ అధికారి సబిత, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంఈవో సోమయ్య, డీఈఎంవో స్వరూపారాణి, సీహెచ్‌వో మధుసూదన్, ఆర్‌ఐ అర్జన్ పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...