పల్లె ప్రగతికి సర్కార్ శిక్షణ


Tue,February 19, 2019 03:29 AM

-కొత్త చట్టంపై అవగాహన
-మూడు అంశాలకు ప్రాధాన్యత
-త్వరలో శిక్షణ ప్రారంభం
- ప్రతీ విడతకు 65 మంది సర్పంచ్‌లు
-ఏర్పాట్లు చేస్తున్న పీఆర్ అధికారులు
అర్బన్ కలెక్టరేట్, ఫిబ్రవరి 18 : దేశానికి పట్టుకొమ్మలాంటి పల్లెలను ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించి అమలుకు స్వీకారం చుట్టింది. గ్రామ స్వరాజ్యంలో కీలకపాత్ర పోశించేంది గ్రామ ప్రథమ పౌ రుడు సర్పంచ్. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్‌లే ప్రధాన పాత్ర పోశించాల్సి ఉంటుంది. పల్లెలను ప్రగతి పథకంలో నడిపించేందుకు సర్పంచ్‌తో పాలక వర్గానికి శిక్ష ణ తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తుంది.
గతంలో కూడా సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కానీ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆరు నెలలకో, సంవత్సరానికి ఉండేది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ మాత్రం కొత్తగా ఎంపికైన వారికి ముందస్తుగానే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అమలులోకి వచ్చిన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018పై సర్పంచ్‌లుగా ఎన్నికైన వారికి అవగాహన కలిగి ఉండటంతో పాటు గ్రామాలు అభివృద్ధి బాటలో నడిపించే పలు అంశాలపై కూడా అవగాహన కల్గి ఉండాలని ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యంగా పంచాయతీ రాజ్ కొత్తచట్టం, హరితహారం, స్వచ్ఛభారత్, మోడల్ గ్రామాలు అనే అంశాలపై అవగాహన కల్పించి పల్లెల్లో అమలు చేసేందుకు సర్కారు కార్యచరణ సిద్ధం చేసింది. అందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా నుంచి

ఎంపిక చేసిన పదిమంది ట్రేనర్ ఆఫ్ ట్రేనర్స్(టీవోటీ)లను హైదరాబాద్ ప్రగతి భవనలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల నుంచి వచ్చిన టీవోటీలకు పలు అంశాలపై స్వయంగా సీఎం దిశా నిర్ధేశం చేశారు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న టీవోటీలు జిల్లాలోని 130 మంది సర్పంచ్‌లకు బుధవారం నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తారని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించామన్నారు. ప్రతీ విడతలో 65 మంది చొప్పున రెండు విడతలలో శిక్షణ పూర్తి చేయనున్నారు. అలాగే రెండో విడతలో భాగంగా ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కూడా మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.

మూడు ప్రాధాన్యత అంశాలు..
గ్రామాలు అభివృద్ధి బాటలో నడవాలంటే ముఖ్యంగా మూడు అం శాలపై దృష్టి సారించాలని ప్రభు త్వాధికాలు నిర్ణయించారు. ప్రధాన్యత అం శాలుగా భావించిన మోడ ల్ గ్రామాలుగా తీర్చిదిద్ద డం, హరిహారంలో భా గంగా మొక్కలునాటి పెంచడం,
స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రా మాలను పరిశుభ్రంగా ఉంచడం లాంటి కార్యాక్రమాలపై టీవోటీలు సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 130 మంది గ్రామ సర్పంచ్‌లు ఉండగా ఒక్కొక్క విడతకు 65 మంది చొప్పున రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.

శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లకు గ్రామాల అభివృద్ధ్దిపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 130 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండు విడతలుగా ఒక్కొక్క విడత ఐదు రోజుల చొప్పున శిక్షణ ఇవ్వనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. అయితే ఉన్న సర్పంచ్‌లలో 50 శాతంమంది మహిళలే ఉన్నందున శిక్షణ సందర్భంగా ఎవ్వరికీ ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు బస, భోజనం, ఇతర వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

శిక్షణ పొందిన టీవోటీలు వీరే..
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యం లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లానుంచి పది మందిని ఎంపికచేసి పంపించారు. వీరిలో విరమణ డీపీవో లు అసోద సారయ్య, ఖాజ జమీర్‌అహ్మద్, విరమణ ఎం పీడీవోలు సీ వెంకట్‌రెడ్డి, వీ నర్సింహరెడ్డి, అరుణాదేవి, ఈవోపీఆర్టీలు జీ రవిబాబు, ఏ శ్యాంకుమార్, సీనియర్ సీఆర్పీ టాకూర్ ఉమ, పంచాయతీ సెక్రటరీ కే సంజీవరెడ్డి, కో ఆర్డినేటర్ ఎన్ రాజశ్రీ, పంచాయతీ సెక్రటరీ జీ వెంకటేశ్వర్లు ఉన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...