బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా పరామర్శ


Tue,February 19, 2019 03:24 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు తండ్రి రామయ్య అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం వెంకటేశ్వర్లు ఇంటికి చేరుకుని రామయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతికి గల కారణాలను తెలుసుకుని కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతితో కలిసి పరామర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుడు రా మయ్య మృతి బాధాకరమని అన్నారు. అదేవిధంగా పరకాల పట్టణంలోని మాదారం కాలనీకి చెందిన గూడెల్లి నరేశ్, లింగాల అనసూర్యలు వేర్వేరు కారణాలతో ఇటీవల మృతిచెందగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శించి ఓదార్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఏడాది తేడాలోనే చనిపోయిన విషయాన్ని నరేశ్ కుటుంబసభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వపరంగా మృతుల కుటుంబాలను ఆదుకునేలా చూస్తానని చెప్పారు. అంతేకాకుండా నరేశ్, అనసూర్య కుటుంబసభ్యులను ఓదార్చి ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, టీఆర్‌ఎస్ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జం రమేశ్, పాడి ప్రతాప్‌రెడ్డి, పర్నెం తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు మడికొండ సంపత్‌కుమార్, పాడి నవత భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...