ప్రజల భద్రతకే కార్డన్‌సెర్చ్


Tue,February 19, 2019 03:23 AM

-పరకాల ఏసీపీ సుధీంద్ర
-మండలంలో పోలీసుల నాకాబందీ

శాయంపేట : ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్ నిర్వహించామని ఏసీపీ సుధీంద్ర అన్నారు. మండల కేంద్రాన్ని సోమవారం సా యంత్రం పోలీసులు నాకాబందీ చేశారు. నాలుగు నుంచి ఏడు గంటల వరకు తనిఖీ చేపట్టారు. నర్సంపేట, మామునూరు, పరకాల డివిజన్లకు చెందిన సుమారు వంద మంది పోలీసులు నాకాబందీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 27 ద్విచక్రవాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఏసీపీ వైవీఎస్. సుధీంద్ర శాయంపేటలోని పలు కాలనీల్లో నడుచుకుంటూ తిరిగి గ్రామంలో ఉన్నపరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం శాయంపేట బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. ప్రజలు పోలీసులతో ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. శా యంపేటలో సుమారు పదివేల జనాభా ఉందని కానీ కేవలం మూడు సీసీ కెమెరాలే ఉన్నాయన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థ్ధికంగా సహకరించాలన్నారు. ఈ సందర్బంగా శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి తన తరపున శాయంపేటలో నాలుగు సీసీ కెమెరాలను త్వరలోనే అందజేస్తానని ఏసీపీకి హామీ ఇచ్చారు. కాలనీల్లో కమిటీలు వేసుకని నెల రోజుల్లోనే 30 కెమెరాలు పెట్టుకోవాలన్నారు. ఫేక్ కాల్స్‌ను నమ్మి బ్యాంకు, ఏటీఎం నంబర్లను చెప్పవద్దన్నారు. మైలారానికి చెందిన ఒకరు నమ్మి లక్షలు నష్టపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ షాదుల్లాబాబా, ఎస్సై రాజబాబు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...