అభివృద్ధి పథంలో ఐలోని..!


Tue,February 19, 2019 03:23 AM

-ప్రభుత్వం చొరవతో మరింత ముందుకు
-కుడా నుంచి రూ.2 కోట్లు మంజూరు
-విశాంత్ర భవనం.. కల్యాణ మండపం రెండు స్వాగత తోరణాల నిర్మాణం..
-విలేకరుల సమావేశంలో ఎంపీపీ మార్నేని
ఐనవోలు, ఫిబ్రవరి 18: ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చోరవ చూపిస్తుందని ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం అభివృద్ధికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.2 కోట్లు మంజూరైనట్లుగా ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు పేర్కొన్నారు. ఆలయాభివృద్ధి ప్రణాళికబద్ధంగా మందుకు సాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఆలయాభివృద్ధికి సుమారుగా రూ.4 కోట్లు మంజూరైనట్లుగా ఆయన గుర్తు చేశారు.

ఆలయ అభివృద్ధికికుడా సహకారం
ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం అభివృద్ధికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ప్రత్యేక సహకరం అందిస్తోందని ఎంపీపీ పేర్కొన్నారు. ఇప్పటికే కుడా నిధు లు రూ.1.50కోట్లతో ఆలయ ఆవరణం 16 ఎకరాల చు ట్టూ రాతి ప్రహరీ నిర్మాణం, ఆరు పెద్ద హైమాస్ టవర్లు, లైట్లు ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ఇవే కాకుండా భక్తులు విడిది చేయడానికి విశాంత్ర భవనం, కల్యాణ మండపం, తూర్పు వైపున రెండు స్వాగత తోరణాల నిర్మాణానికి గతంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి కుడా సమావేశంలో కోరినట్లుగా ఆయన వివరించారు. స్పందించిన కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వైస్ చైర్మన్లు విశాంత్ర భవ నం, కల్యాణ మండప నిర్మాణం కోసం రూ. కోటి 40 లక్ష లు, తూర్పు వైపున రెండు స్వాగత తోరణాల కోసం రూ. 60 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన వారం రోజుల్లో జరిగి పనులు ప్రారంభం కానున్నట్లుగా ఆయన వివరించారు.

వారం రోజుల్లో ప్రారంభోత్సవాలు..
నూతనంగా ఏర్పడిన ఐనవోలు మండలం అభివృద్ధిపథంలో నడుస్తోందని, వారం రోజుల్లో ఆలయంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన ఎమ్మార్సీ భవనం, ఎస్సీ కాలనీలో మినీ ఫంక్షన్ హాల్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభిస్తామని ఎంపీపీ పేర్కొన్నారు.
మల్లన్న ఆలయాభివృద్ధికి, మండల అభివృద్ధికి సహకరిస్తున్న కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, మాజీ డిప్యూటి సీఎం కడియం శ్రీహరికు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచులు జన్ను కుమారస్వామి, కంజర్ల రమేశ్, ఎంపీటీసీ బొల్లెపల్లి మధు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ గజ్జెల్లి శ్రీ రాములు, డైరెక్టర్ తక్కళ్లపల్లి చందర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కోఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, టీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు మునిగాల సంపత్‌కుమార్, నాయకులు సమ్మారావు, దేవేందర్, కొంరయ్య, ఆగయ్య, అనిల్, పరమేశ్, సుధీర్, సతీశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...