కమిషనరేట్‌కు నాలుగు జాగిలాలు


Tue,February 19, 2019 03:22 AM

-రెండు స్నిఫర్, రెండు ట్రాకర్
-సీపీ రవీందర్‌కు గౌరవ వందనం
నయీంనగర్, ఫిబ్రవరి18 : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్తగా నాలుగు జాగిలాలను రాష్ట్ర పోలీస్‌శాఖ కేటాయించింది. మొహినాబాద్‌లో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకొని సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ చేరుకున్నాయి. హ్యాండిలర్స్ రమేశ్, సర్వేశ్వర్, సుధాకర్, సార య్య జాగిలాలను తీసుకొని సీపీ రవీందర్‌ను జేఎన్‌ఎస్ స్టేడియంలో కలిశారు. ఈ సందర్భంగా జాగిలాలు స్కాంప ర్, కాలా, రుద్ర, లీనా సీపీకి గౌరవ వందనం చేశాయి. నాల్గింటిలో రెండు స్నిపర్స్, మరో ట్రాకర్ లక్షణాలు కల్గిన జాగిలాలు. ఇవి ప్రేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలు, చోరీలు, హత్యలు చేసిన నిందితులను గుర్తించడంతో పా టు వీఐపీలు పర్యటించే ప్రాంతాల్లో ముందుస్తు తనిఖీలు నిర్వహించడానికి వినియోగించనున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనువాస్‌రెడ్డి, మహబూబాబాద్ అదనపు ఎస్పీ గిరిధర్, ఏసీపీ శ్రీనువాస్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...