బాలిక కిడ్నాప్‌నకు యత్నం


Sun,September 23, 2018 03:33 AM

-నిందితులను పట్టుకున్న గ్రామస్తులు
-పోలీసులకు అప్పగింత
-విచారిస్తున్న డీసీపీ, ఏసీపీ

ఖానాపురం, సెప్టెంబర్ 22 : బాలికను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన మండలంలోని బుధరావుపేట శివారు బోడ్యాతండాలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం ఇదే తండాకు చెందిన లకావత్ రవి-జ్యోతి దంపతులు. వీరికి ఇద్ద రు సంతానం. కాగా కూతురు ఝాన్సీ(9) ఇదే గ్రా మంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చ దువుతోంది. శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఇంటి సమీపంలోని ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆడుకుంటోంది. అదే సమయంలో ఆటోలో ఒ వ్యక్తి తో పాటు ఇద్దరు మహిళలు వచ్చి అంగన్‌వాడీ సాలమ్మ ను ఇక్కడ దేవుడు చెప్పే వారి ఆచూకి కావాలని అడిగారు. దీంతో సాలమ్మ స్పందించలేదు. అక్కడే ఆ డుకుంటున్న ఝాన్సీకి మాయ మాటలు చెప్పి వా రు ఆటోలో తీసుకెళ్తుండగా సాలమ్మ బాలిక తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే బాలిక తండ్రి రవి పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం అందించి ఆటోను అడ్డుకోవాల్సిందిగా కోరా డు. ఆగంతకులు బస్టాండ్ సెంటర్లోని మురారి హో టల్‌లో పాపతో పాటు టిఫిన్‌చేస్తుండగా వారిని గ్రా మస్తులు నిలదీశారు.

దీంతో వారు తడబడి పొంతనలేని సమాధానం చెప్పడంతో గామస్తులు వారితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ఎస్సై అభినవ్ సిబ్బందితో హోటల్ వద్దకు చేరుకోగా గ్రామస్తులు ఆగంతకులను పోలీసులకు అప్పగించారు. వారిని విచారణ చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఇదే గ్రామంలో సంవత్సరంన్నర క్రితం ఇర్షద్ అనే విద్యార్థి భీమునిపాదం గుట్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కా గా ఝాన్సీ కిడ్నాప్ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. బాలిక తండ్రి ఫిర్యాదు మే రకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిన్నారి కిడ్నాప్ య త్నంపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చే స్తున్నారు. విచారణకు డీసీపీ అనురాధ, ఏసీపీ సునీతామోహన్ హాజరైనట్లు పోలీసులు తెలిపారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...