ప్రభుత్వ పథకాల్లో వేగం పెంచాలి


Sun,September 23, 2018 03:32 AM

-ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ: విద్యుత్ మెరుగైన సరఫరా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పనులను ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు అన్నారు. శనివారం సంస్థ పరిధిలోని 16 జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు, కన్‌స్ట్ర క్షన్ డివిజనల్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో డైరెక్టర్ పిన్నింటి మో హన్‌రెడ్డితో కలసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలైన దీన్ దయాళ్ ఉపాధ్యయ్ గ్రామీణ్ జ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసు కున్నా రు. ఈ స్కీంలో దరఖాస్తు రాగానే వాటిని మంజూరు చేసి మీటరు బిగించాలన్నారు. 33 పట్టణాల్లో జరుగుతున్న ఈ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ట్రాన్స్‌ఫార్మర్, కొత్త కండక్టర్ లైన్ల స్థితి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాత 11 కేవీ లైన్లను, ఎల్ టీ లైన్లను మార్చాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. కార్యక్రమంలో సీజీఎంలు మోహన్‌రావు, ఎస్‌ఈలు రాజు చౌహాన్, శివరాం, ప్రభాకర్, శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్, ఉత్తమ్, మల్లికార్జున్, సురేందర్, శేషారావు, రమేశ్‌రావు, నారాయణ, విజేందర్‌రెడ్డి, సామ్యానాయక్ పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...