ఖంగుతిన్న కాంగ్రెస్...


Sun,September 23, 2018 03:32 AM

-సోమారం గ్రామంలో ఫ్లెక్సీల కలహం
-అనుమతి లేకుండా ఫొటోలు పెట్టారని టీఆర్‌ఎస్ శ్రేణుల ఆగ్రహం
-బ్యానర్లలో ఫొటోలు తొలగించుకున్న వైనం
-కాంగ్రెస్ నాయకులపై గ్రామస్తుల మండిపాటు

తొర్రూరు, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 22: కారు జోరుకు కాంగ్రెస్ అందనంత దూరంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు కొత్త కుయుక్తులు మొదలు పెట్టారని టీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. జెండా పండుగల పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరికల పేరుతో ప్యాకేజీలకు దిగుతూ క్యాడర్ పెంచుకోవడానికి కష్టాలు పడుతున్నారని, కళ్లబొల్లి కబుర్లతో కాలం వెల్లదీయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సోమారం గ్రామంలో శనివా రం చోటు చేసుకున్న పరిణామం కాంగ్రె స్ కక్కుర్తి రాజకీయాలకు నిదర్శనమం టూ ఆగ్రహంతో కాంగ్రెస్ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఫోటోలు తొలగించి నిరసనను వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఖంగు తినిపించాయి. వాస్తవ పరిస్థితులు గమనించిన గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎట్టకేలకు ఫ్లెక్సీలను తొలగించుకోవాల్సిన పరిస్థితి నెలకుంది. సోమారం గ్రామంలో శనివారం ఫ్లెక్సీల తొలగింపు కలహం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరనప్పటికీ ఆ పార్టీకి చెందిన ఫ్లెక్సీల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురి ఫొటోలు ప్రత్యక్షం కావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి శుక్రవారం సోమారం గ్రామానికి వెళ్లిన సందర్భంలో ఆయన కు స్వాగతం పలుకుతూ గ్రామ కాంగ్రెస్ నేతలు పలువురు కార్యకర్తల ఫొటోలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లపై తీవ్ర అభ్యంతరాలు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరారని ప్రకటించుకోవడంతో ఆ పార్టీలోకి వెళ్లకుండా ఫ్లెక్సీల్లో ఫొటోలు పెట్టిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంత మంది వ్యక్తు లు ఉద్ధేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు దిగారని మండిపడుతున్నారు. మేమంతా దయాకర్‌రావును నమ్ముకుని, గ్రామంలోని టీఆర్‌ఎస్ నేత హరిప్రసాద్ నాయకత్వంలో పని చేస్తుండగా గిట్టని కొంత మంది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీల్లో ఉన్న ఫొటోలను బ్లేడ్ సహయంతో చించివేసి తొలగించుకున్నారు. గ్రామంలోని మునిగేటి వెంకటయ్య, యాకయ్య, చెడుపల్లి సాయిలు, బందు నరేశ్, యాకయ్య, కొమురయ్య, తాటికాయల సాయిలు, భిక్షం, బిర్రు కొమురయ్య, ఎడెల్లి పొట్టి రాంచంద్రు తదితరులు తాము కాంగ్రెస్‌లో చేరనేలేదని, తమ ప్రమేయం లేకుండానే ఆ పార్టీ నాయకులు బ్యానర్లలో తమ ఫొటోలు పెట్టారని ప్రకటించారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...