దివ్యాంగులు టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి


Sun,September 23, 2018 03:31 AM

నర్సంపేట : దివ్యాంగులు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్‌కోరారు. ఆదివారం నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగులకు పెద్ది సుదర్శన్‌రెడ్డి సొంత ఖర్చులను భరించి బస్సు పాస్‌లను అందించారు. ఈ సందర్భంగా బసుపాస్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనిలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిష్కరించారని అన్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగులకు రూ.4 లక్షల ఖర్చులతో దివ్యాంగులకు, విద్యార్థులకు బస్సుపాస్‌లకయ్యే ఖర్చులను పెద్ది భరించడం అభినందనీయమన్నారు. నర్సంపేట నియో జకవర్గానికి పాకాల, రంగయ్య చెరువులకు దేవాదుల నీటిని రప్పిస్తూన్నారని అన్నారని అన్నారు. ఇటీవలే ములుగుకు పదివేల మంది రైతులను తరలించి ప్రాజెక్టు నిర్మాణ పనులను పెద్ది సుదర్శన్‌రెడ్డి చూపించారని పేర్కొన్నారు. రవాణా సౌకర్యం మెరుగు పర్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్పచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన కోరారు. నర్సంపేట ప్రాంత అభివృద్ధిలో పెద్ది తనవంతు పాత్ర పోషించారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క మున్సిపాలిటీలో జాన్‌రామ్ బస్సులను తెప్పించిన ఘనత మనకే దక్కుతుందని రాష్ట్ర సివిల్ సప్లయ్‌కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. దివ్యాంగులకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంలో ఉన్నానని అన్నారు. డిపోను మరింత అభివృద్ధి చేస్తానని అన్నా రు. కార్యక్రమంలో డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి,రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, బండి రమేశ్, నాయిని నర్సయ్య,నాగిశెట్టి ప్రసాద్, పెండెం వెంకటేశ్వర్లు,మండలశ్రీనివాస్,ఎంవీరామా రావు, నగేష్, రాంబాబు,గంపరాజేశ్వర్‌గౌడ్,పుట్టపాకకుమారస్వామి, చిలువేరు రమేష్,చిలువేరు సత్యనారాయణగౌడ్,డీఎంశ్రీనివాస్,యూనియన్ నాయకులు ఏపీరావు, సరస్వతీ

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...