అభివృద్ధిని చూసి ఆదరిస్తున్నారు


Sun,September 23, 2018 03:28 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : నాలుగున్నర సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే ప్రజలు టీఆర్‌ఎస్‌ను విశేషంగా ఆదరిస్తున్నారని వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మహేందర్‌రావు బీజేపీకి రాజీనామా చేసి అరూరి రమేశ్ సమక్షంలో 150 మంది కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహేందర్‌రావుతోపాటు పార్టీలో చేరిన వారికి అరూరి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం 14 ఏళ్లపాటు ఉద్యమం చేసిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారన్నారు. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇందుకోసమే అనేక మంది వివిధ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. అలాగే ఉప్పరపల్లి గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఐనవోలు చైర్మన్ గజ్జెలి శ్రీరాములు, పార్టీ మండల అధ్యక్షుడు మార్గం బిక్షపతి, నాయకులు అల్లమనేని మోహన్‌రావు, ఎండీ అన్వర్, సీనపెల్లి కొమురయ్య, ముత్యం సంపత్, పూజారి రఘు, స్వామిరాయుడు, ఆరెల్లి అంజన్‌రావు, కందగట్ల సంజీవ, కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, శ్రీనివాస్, మంచోజు రాజు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...