ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతుకావాలి


Thu,September 20, 2018 04:00 AM

-టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
-కత్తెరపల్లి దామోదర్
సంగెం, సెప్టెంబర్ 19 : చల్లా ధర్మారెడ్డి గెలుపుతో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తెరపల్లి దామోదర్ అన్నారు. మండలంలోని కొత్తగూడెం, గవిచర్ల, తీగరాజుపల్లి గ్రామాల్లో బుధవారం టీఆర్‌ఎస్వీ, జాగృతి, చల్లా యువసేన ఆధ్వర్యంలో యూత్ ప్రతినిధులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కత్తెరపల్లి దామోదర్ మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చల్లా ధర్మారెడ్డి గెలుపు కోసం యువత సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు రూ.1200 కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేసి జిల్లాలో పరకాల నియోజకవర్గాన్ని చల్లా ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. చల్లా ధర్మారెడ్డి గెలుపు ద్వారా బంగారు పరకాల సాధ్యం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు యార బాలకృష్ణ, ప్రతినిధి జున్న రాజుయాదవ్, ఆకుల వెంకట్, గవిచర్ల ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్, కొత్తగూడెం మాజీ సర్పంచ్ వాసం సాంబయ్య, నాయకులు నర్సయ్య, సుమన్, బిక్షపతి, రాజు, అఖిల్, అనిల్, శ్రావణ్‌కుమార్, విక్రమ్, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...