అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డిని గెలిపించుకోవాలి


Thu,September 20, 2018 03:59 AM

-వరంగల్ గ్రేయిన్ మార్కెట్ చైర్మన్ ధర్మరాజు
ఆత్మకూరు,సెప్టెంబర్19 : పరకాల అభివృద్ధి ప్రదాత, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వరంగల్ గ్రేయిన్ మార్కెట్ చైర్మన్ ధర్మరాజు కోరారు. మండలంలోని అగ్రంపహాడ్, లింగమడుగుపల్లి, కటాక్షపురం, హౌసుబుజుర్గు గ్రామాల్లో టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ధర్మరాజు పాల్గొని మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాసుఖాల్లో పాలు పంచుకుంటున్న చల్లా ధర్మారెడ్డికి మళ్లీ అవకాశం కల్పించాలన్నారు. రూ.కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల మన్ననలను పొందిన చల్లాను మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రవీందర్, పార్టీ మండల అధ్యక్షుడు సంపత్, మండల ప్రధాన కార్యదర్శి కాంతాల కేశవరెడ్డి, జిల్లా నాయకులు బొల్లోబోయిన రవియాదవ్, బోల్లోజుకుమారస్వామి, దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, గుండెబోయిన రాజన్న, గుండెబోయిన బాలకృష్ణ, వంచ సాంబశివరెడ్డి, వేముల నవీన్, సావురే రాజేశ్వర్‌రావు, శీలం సాంబయ్య, కత్తరశాల మల్లేశం, ఎస్‌కే హుస్సెన్, అండ్రవిశ్వేశ్వర్‌రెడ్డి, రేవూరి దేవేందర్‌రెడ్డి, లకిడే మాల్లాజీ పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...