పంటకోత ప్రయోగాలు నిర్వహించాలి


Thu,September 20, 2018 03:58 AM

-జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్
నర్సంపేట రూరల్, సెప్టెంబర్19: రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో భాగంగా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలు నిర్వహించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్ అన్నారు. బుధవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వివిధ మండలాల ఏవో, ఏఈవో, వీఆర్వోలకు పంటకోత ప్రయోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట కోత ప్రయోగాలు నిర్వహించడంతో దిగుబడి అంచనాలు లెక్కగట్టే రైతులకు ప్రధానమంత్రి బీమా యోజన పథకం వర్తింపజేయవచ్చన్నారు. రైతులు పంట పండించే సమయంలో పంటలు పాడైతే ఫసల్ ఈ పథకం ద్వారా రైతులకు నష్ట పరిహారం చెల్లించవచ్చని చెప్పారు. అంతేగాకుండా పంట కోత ప్రయోగాల ఆధారంగానే దేశ, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని లెక్కించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్‌వో ఎం వెంకట్‌రావు, నర్సంపేట ఏవో యాదగిరి, మహినా, సుల్తానా, కాంట్రాక్టు సూపర్‌వైజర్లు కుమారస్వామి, భద్ర య్య, ప్రవీణ్, స్వామి, పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...