టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి


Wed,September 19, 2018 03:20 AM

-వరంగల్ గ్రేయిన్ మార్కెట్ చైర్మన్ ధర్మరాజు
ఆత్మకూరు,సెప్టెంబర్18 : టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని వరంగల్ గ్రేయిన్ మార్కెట్ చైర్మన్ ధర్మరాజు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం నాగయ్యపల్లిలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ధర్మరాజు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. రైతుల సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూ.కోట్లు తీసుకవచ్చి పరకాల నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభివృద్ధి చేశారన్నారు. ఎన్నికల్లో మళ్లీ ధర్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకోవాలన్నారు. గ్రామాల్లో చల్లా గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రవీందర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంపత్, ప్రధాన కార్యదర్శి కాంతాల కేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజస్వామి, జిల్లా నాయకులు బొల్లోజు కుమారస్వామి, బొల్లోబోయిన రవియాదవ్, అండ్ర విశ్వేశ్వర్‌రెడ్డి, సావురే రాజేశ్వర్‌రావు, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్, కమలాకర్, ముల్కరాజు, అర్జున్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...