దొంతి.. చిల్లర రాజకీయాలు మానుకో


Wed,September 19, 2018 03:19 AM

-ఎమ్మెల్యే కాకున్నా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా..
-ఓర్వలేకనే దిగజారుడు ఆరోపణలు
-సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి
-టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
చెన్నారావుపేట, సెప్టెంబర్18 : నర్సంపేట నియోజకర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, వాటిని వెంటనే మానుకోవాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేటకు ఎమ్మెల్యే కాకున్నా ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేశానన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దొంతి మాధవరెడ్డి దిగజారుడు ఆరోపణలు చేస్తున్నాడన్నారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతులకు సబ్సిడీపై వివిధ పథకాలను అందించేందుకు కృషి చేస్తుంటే అవి రాకుం డా అడ్డుకుంటూ కలెక్టర్, అధికారులను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే ప్రజ లు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక....
చెన్నారావుపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంతి మల్లయ్య, టీడీపీ నాయకుడు మండల కట్టయ్య, మర్రి సాంబయ్య, పిట్టల సారయ్య, సమ్మయ్య, కురుమ సంఘం పెద్ద కోరె వెంకటయ్య, తాపీ సంఘం అధ్యక్షుడు జెట్టబోయిన శ్రీను, అడుప అశోక్, ఎదురబోయిన వీరస్వామి, వీరేంద్రనాథ్, వినోద్‌కుమార్, కుమారస్వామి, కోటి, రమేశ్, సతీశ్, రాజు, శేఖర్, మంద ముత్తీశ్వర్‌తో పాటు 100 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి పెద్ది సుదర్శన్‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి బాల్నె వెంకన్న, రైతు సమన్వయ సమితి మండల కన్వినర్ బుర్రి తిరుపతి, జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...