80శాతం ఓటర్లు కాంగ్రెస్‌కు వ్యతిరేకం


Wed,September 19, 2018 03:19 AM

నెక్కొండ : నియోజకవర్గంలోని 80 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా మాధవరెడ్డి నాలుగేళ్లలో ప్రజలకు చేసింది ఏమిలేకపోగా నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. అనంతరం మండలంలోని రెడ్లవాడ, మహబూబ్‌తండాలకు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు చాగంటి సూరయ్య, గుండెబోయిన దేవేందర్, ఉప్పలయ్య, వీరస్వామి, అశోక్, ఐలయ్య, నవీన్‌తో పాటు 200 మంది పెద్ది సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ నబీ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ ఆవుల చంద్ర య్య, వైస్‌ఎంపీపీ సారంగం, మాజీ సర్పంచ్ అన్నమనేని సంతోష్‌కుమార్, నాయకులు జలగం సంపత్‌రావు, తాటిపల్లి శివకుమార్, జయరాం, హరికిషన్, వెంకన్న పాల్గొన్నారు.

నల్లబెల్లి : మండలంలోని రుద్రగూడెం గ్రా మానికి చెందిన గంగారపు రవి ఆధ్వర్యంలో 25 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా పెద్ది సు దర్శన్‌రెడ్డి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఖానాపురం మండలాధ్యక్షుడు వేముల ప్రకాశ్‌రావు, మైలగాని సురేశ్, బుచ్చిరెడ్డి, రాజు, లింగయ్య, వినయ్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...