జై కొట్టిన వర్ధన్నపేట


Wed,September 19, 2018 03:19 AM

-గత ఎన్నికల్లో కంటే రమేశ్‌కు భారీ మెజార్టీ వస్తుంది
-ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
-వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం
-టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
హన్మకొండ రూరల్, సెప్టెంబర్ 18 : గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి మించి ఈ సారి అరూరి రమేశ్‌కు వస్తుందని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ ఆరేపల్లి వజ్రా గార్డెన్‌లో కార్పొరేటర్ వీరభిక్షపతి అధ్యక్షతన డివిజన్ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్, ఎంపీ వినోద్ కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఆణిముత్యంలాంటి అరూరిని అప్పగించారన్నారు. నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 3వేల కి.మీ జాతీయ రహదారులను అభివృద్ధి చేసిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరందించవచ్చన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టనన్ని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. 2014లో అరూరి రమేశ్ ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు.

గత ఎన్నికలో రెండో భారీ మెజార్టీ : అరూరి
గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో భారీ మెజార్టీతో వర్ధన్నపేట ప్రజలు తనను దీవించారని ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. తనకు రెండోసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదాభివందనం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకువెళ్తోందన్నారు. దశాబ్దాల కాలంగా కానీ పనులు నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మరోవైపు నియోజకవర్గంలోని విలీన గ్రామాలాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఒకటో డివిజన్‌లోనే రూ.23 కోట్లతో పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని అరూరి కోరారు. అంతకముందు పైడిపల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అరూరి పూజలు నిర్వహించి ర్యాలీగా చేరుకున్నారు.

మళ్లీ గెలిపిస్తాం : కార్పొరేటర్లు
రమేశన్నను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పలు డివిజన్ల కార్పొరేటర్లు అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై మనసు గెలిచిన నాయకుడిగా అరూరి పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లలితా కుమార్‌యాదవ్, జిల్లా నాయకులు ఊకంటి వనంరెడ్డి, ఇండ్ల నాగేశ్వరరావు, కార్పొరేటర్లు స్వర్ణలత, చింతల యాదగిరి, బానోతు కల్పన, జోరిక రమేశ్, ల్యాదల్ల బాలు, ఏఎంసీ చైర్మన్ బండి రజనీకాంత్, నియోజకవర్గ మైనార్టీ నాయకులు షేక్ ఉస్మాన్ అలీ, ఆదాం అలీ, మండల నాయకులు బుద్దె వెంకన్న, బోనాల సల్డాన్, డివిజన్ అధ్యక్షుడు నేరెల్ల రాజు, గ్రామ కమిటీల అధ్యక్షుడు తిరుమలయ్య గౌడ్, హరికృష్ణ, శ్రీనివాస్, సంజీవ, విజయ్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరికలు
ఆరేపల్లి టీఆర్‌ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు బొమ్మ తిరుమలయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు, మహిళా సంఘాలకు చెందిన వందమంది మహిళలు అరూరి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ వినోద్ కుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వనలక్ష్మి, మహేశ్వరి, సునీత, రాజమణి, రాణి, శ్రీలత, కవిత, లత, స్వరూప, రమ, యాకూబీ, భాగ్య, రాజమ్మ, రాధిక, లావణ్య, మనెమ్మ, రాజేశ్వరి, కౌసల్య, రహీమున్నీసా, సుల్తానా, గౌసియా, బట్టమేకల రాజు, కుమార్, వేణు, సాంబయ్య, రాజయ్య, రమణ, బీరయ్య ఉన్నారు.

మడికొండ: 53వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాతంగి రాజు ఆధ్వర్యలో పోలెపల్లి రామ్మూర్తి, మాచర్ల శేఖర్, తౌటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గడ్డం దేవదాసు, ఆకారపు నాగరాజు, రాజేశ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...