ఓటరు జాబితా పూర్తిచేయాలి


Wed,September 19, 2018 03:19 AM

అధికారులతో కలెక్టర్ ముండ్రాతి హరిత
రూరల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 18 : త్వరలో జరిగే ఎన్నికల కోసం ఓటరు జాబితాలో చేపట్టాల్సిన అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను బుధవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిత రెవన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోటీస్ జనరేషన్ సర్వీసింగ్, లాజికల్ ఎరైల్స్, బోగస్ కార్డుల ఏరివేత, చనిపోయిన వారి వివరాలకు సంబంధించిన అంశాలన్ని బుధవారం మధ్యాహ్నం వరకు పూర్తికావాలన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన సాంకేతిక పనులకు అధిక ప్రాధ్యాతనిచ్చి త్వరగా పూర్తి చేయాలన్నారు. సాంకేతిక తప్పుల విషయంలో ఆధార్ కార్డులను పరిశీలించి, ఓటర్ల వయసును సరి చేయాలన్నారు. బూత్‌లెవల్ అధికారుల స్థాయిలో గానీ, ఏఈఆర్‌వో, ఈఆర్‌వో స్థాయిలో గానీ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచవద్దన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు వందశాతం ఈఆర్‌వో లాగింగ్‌లో నోటీస్ జనరేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి తదితరులుపాల్గొన్నారు.

ఈవీఎంల ఫస్ట్‌లెవెల్ చెకింగ్ కార్యక్రమం
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈవీఎంల ఫస్ట్‌లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ హరిత పరిశీలించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16న జిల్లాకు బెంగళూరు నుంచి ఈవీఎంలు చేరిన విష యం తెలిసిందే. అయితే, ఎన్నికల సయమంలో ఈవీఎంలలో ఎలాంటి సమస్య లు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిని బెల్ కంపెనీకి చెందిన సాంకేతిక నిపుణులతో ఫస్ట్‌లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ కలిపి మొత్తం 120 యూనిట్లను పరిశీలించారు. బీయూ, సీయూల చెకింగ్ సుమారు 3 నుంచి 4 రోజులు పడుతుందని జిల్లా అధికారులు వెల్లడించారు. వీటిని చెక్ చేసిన తర్వాత వీవీప్యాట్స్‌ను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ రావుల మహేందర్‌రెడ్డి, ఆర్డీవోలు మహెందర్‌జీ, కిషన్, బెల్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు, టీఆర్‌ఎస్ నాకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, మొగిళి, జయపాల్‌రెడ్డి, శ్రీధర్, రాజు, బీజేపీ నాయకులు వీ రమణారెడ్డి, నర్సింహరావు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...