మీవెంటే మేముంటాం..


Wed,September 19, 2018 03:19 AM

-కులవృత్తులను గౌరవించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే
-ఎర్రబెల్లి నాయకత్వాన్ని బలపరుస్తున్న గౌడ కులస్తులు
దేవరుప్పుల, సెప్టెంబర్ 18 : కుల వృత్తులపై ఆధారపడే వారికి అండగా ఉంటూ ప్రప్రథమంగా గుర్తింపు ఇచ్చి ఆదరించింది కేవలం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వమే. అందుకే మేమంతా టీఆర్‌ఎస్ వెంటే ఉంటాం అంటూ కడవెండి గౌడ కులస్తులు స్పష్టం చేశారు. కడవెండిలో మంగళవారం వారు సమావేశమై మెజారిటీ గౌడ కులస్తులు ఎర్రబెల్లి నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, నూతన గ్రామపంచాయతీ భవనం, వివిధ రకాల పథకాలతో ఆయా కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పోతిరెడ్డి లీనారెడ్డి, కోల యాదగిరి, మాజీ సర్పంచ్ సుడిగెల హనుమంతు, పడమటింటి కొంరయ్య పాల్గొన్నారు.

ఎర్రబెల్లికి బ్రహ్మరథం..
తొర్రూరు, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం, తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడడంతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తొర్రూరు గౌడ సొసైటీకి చెందిన సుమారు 50 కుటుంబాల నుంచి 120 మందికి పైగా సభ్యులు మంగళవారం గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్ నాయకుడు కుర్ర శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో దయాకర్‌రావును కలిసి మేమం తా మీ వెంటే ఉంటామని తెలిపారు. గౌడ కమ్యూనిటీ భవనానికి రూ.5లక్షలు మంజూరు చేయడం, అదనంగా మరో రూ.5లక్షలు ఇస్తానని హామీ ఇవ్వడం, ప్రభుత్వం గీతవృత్తికి చేయూతనిస్తుండడంతో గౌడ సొసైటీ సభ్యులంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించుకుని, దయాకర్‌రావును కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆయన గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. గౌడ సొసై టీ సభ్యులు వెంట ఉంటామని తెలుపడంతో దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేసి, గీత కార్మికుల అభివృద్ధికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. గౌడ సొసైటీ ప్రతినిధులు వెంకటసోములు, శంకర య్య, నారాయణ, రామచంద్రు, సత్త య్య, బత్తిని ఉప్పలయ్య, రావుల చిన్నసత్తయ్య, బుర్గు యాక య్య, జలగం స్వామి, జలగం సోమనర్సయ్య, జలగం కవిత, సంధ్య, ఎంపీపీ కర్నె సోమయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వర్‌రావు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పసుమర్తి సీతారాములు, శ్రీనివాస్, నాయకులు హరిప్రసాద్, దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...