రాజేశ్వరాలయం హుండీ లెక్కింపు


Wed,September 19, 2018 03:18 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 18 : ఆకేరువాగు ఒడ్డున ఉన్న సుప్రసిద్ద శ్రీరాజరాజేశ్వరాలయం దేవాలయ హుండీలను మంగళవారం లెక్కించారు. దేవాదాయశాఖ అధికారుల సూచనల మేరకు ఆలయ కమిటీ చైర్మన్ గొడిశాల కవిత, ఎంపీటీసీ శ్రీనివాస్‌ల సమక్షంలో కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది దేవాలయంలోని హుండీలకు వేసిన తాళాలను తీయించారు. సిబ్బంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హుండీల్లో ఉన్న కానునకలను లెక్కించారు. రెండు హుండీల ద్వారా రూ.32,593ల నగదు లభించినట్లు చైర్మన్ కవిత తెలిపారు. హుండీల్లో రెండు అమెరికా డాలర్లు కూడా లభించాయి. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుంటి కుమారస్వామి, సుభాష్, అర్చకుడు నటరాజశర్మ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...