అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్వే


Wed,September 12, 2018 02:59 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 11: వర్ధన్నపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు సర్వే చేశారు. మున్సిపాలిటీ కమిషనర్ రవీందర్ ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో పలు సమస్యలను గుర్తించి పరిష్కా రం కోసం చేపట్టాల్సిన పనులకు సం బంధించిన కొలతలు తీసుకున్నారు. ప్రధానంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్‌కు మరమ్మతులు చేపట్టి కొత్త హంగులు కల్పించడంతో పాటుగా పట్టణంలోని డ్రైనేజీ, ఇతర సమస్యలపై కూడా అధికారులు పరిశీలన జరిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేట మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించడం కోసం రూ.20 కోట్లను మంజూరు చేసింది. దీంతో మంగళవారం ఇంజినీరింగ్ అధికారులు పలు పనులను గుర్తించి కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ ప్రభు త్వం మంజూరు చేసిన నిధులతో ప్రజా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ సారంగం, మేనేజర్ ప్రకాశ్, సంతోశ్, కుమారస్వామి, నరేశ్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...