కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి


Wed,September 12, 2018 02:59 AM

-డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వెంకటరమణ
-దామెర, నడికూడలో వైద్య శిబిరాల సందర్శన
దామెర, సెప్టెంబర్ 11: ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగును ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ వెంకటరమణ కోరారు. మంగళవారం మండలంలోని ఊరుగొండ సేయింట్‌మేరీ స్కూల్‌లో జరుగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో కొత్త ఒరవడిని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని, దీంతో ఎంతోమంది ప్రజలకు కంటి వెలుగు ఉపయోగపడి , వారికి కనుచూపు సక్రమంగా ఉంటున్నదన్నారు. ఈ ఒక్కరోజు ఊరుగొండలో 240మందికి కంటి పరీక్షలను చేయగా 30మందికి అద్దాలను అందించినట్లు, మరో 35మందికి కంటి అద్దాలకోసం ప్రభుత్వానికి నివేదించినట్లు డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వం అందించే కంటి వెలుగు ఎంతో బృహత్తర పథకమని, చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రతీ ఒక్కరికి ఈ వైద్య పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ కమల్‌చంద్‌నాయక్, డాక్టర్ శీరిష,హెచ్‌ఈవో అశోక్‌బాబు, శ్రీకాంత్, ఆర్థోమెట్రిక్ సంగీత, డాటా ఎంటర్ ఆపరేటర్‌లు సురేఖ, రాధిక ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

నడికూడలో..
నడికూడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటరమణ అన్నారు. మంగళవారం నడికూడ మండలం రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటరమణ సందర్శించారు. అనంతరం వైద్యాధికారి వెంకటరమణ తో కలిసి మాట్లాడుతూ కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి కావాల్సిన వారికి కళ్లద్దాలు అందిస్తున్నామన్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 3350 మందకి కంటి పరీక్షలు నిర్వహించి, 586 మందికి కళ్ళద్దాలను అందించామన్నారు. 445 మందిని ఇప్పటి వరకు శస్త్ర చికిత్సల కోసం వివిధ వైద్యశాలలకు పంపించినట్లు తెలిపారు. ఈ గ్రామంలో మరో 10 రోజులు వరకు క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రతీ ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్‌మీడియా అధికారి స్వరూపరాణి,వైద్యబృందం,ప్రజాప్రతినిధులు, ఏఎన్‌ఎంలు,ఆశవర్కర్లు పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటి వెలుగు పథకంలో భాగంగా మండల కేంద్రం లో కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైద్యాధికారి భూపేశ్ మాట్లాడుతూ మంగళవారం నాటికి 3872 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, అదేవిధంగా 858 మందికి కంటి అద్దాలను అందజేశామన్నారు,. 315 మందిని సర్జరీ నిమిత్తం రిఫర్ చేశామని తెలిపారు. 887 మందికి మెరుగైన అద్దాల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లు తెలిపారు. మండలకేంద్రంలో 14 వరకు మాత్రమే కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని అనంతరం కొత్తూరుకు మార్చనున్నట్లు, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమిత్ర మాధవి, ఏఎన్‌ఎమ్ సునిత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...