డబుల్ ఆనందం..


Wed,September 12, 2018 02:56 AM

-రాయపర్తి మండలానికి 659 డబుల్ బెడ్‌రూంల మంజూరు
-నెరవేరనున్న పేదల సొంతింటి కల
-ప్రజా సేవలోనే పరితపిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి
రాయపర్తి, సెప్టెంబర్ 11 : రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సమూహాలకు అండగా నిలిచేందుకు పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అనునిత్యం పరితపిస్తూనే ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మండలి సహచరులతో సమన్వయం చేసుకుని రెండు విడతల్లో ఇండ్లను మంజూరు చేయించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ తనను నమ్ముకున్న మండల ప్రజానీకం ఆకాంక్షలను నెరవేర్చాలన్న లక్ష్యంతో రెండు రోజులుగా రాష్ట్ర రాజధానిలో మకాం వేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి మండల ప్రజల సొంతింటి కలలను సాకారం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి, మంగళవారం విజయం సాధించారు. మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మొత్తం 659 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన పరిపాలన అనుమతులు, ఆర్థిక శాఖ క్ల్లియరెన్స్‌లు సాధించినట్లు మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మండలంలోని కాట్రపల్లి-40, కొండూరు-5, గన్నారం-30, పెర్కవేడు-40, గట్టికల్-30, జగన్నాథపల్లిలోని ఎస్సీకాలనీ-35, కొలన్‌పల్లి-30, కొత్తూరు-40, సన్నూరు గ్రామంలోని ఎస్సీకాలనీ-20, వెంకటేశ్వరపల్లి-10, సన్నూరు గ్రామ పరిధిలోని తేజావత్ తండా-10, మొరిపిరాల పరిధిలోని సుభాష్‌తండా-20, కొండాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ-25, కొండూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ-80, పన్యానాయక్ తండా-20, సన్నూరు-30, సన్నూరు గ్రామంలోని కాశగూడెం-10, మొరిపిరాల క్రాస్ రోడ్డు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ-30, సన్నూరు గ్రామంలోని కొత్త ఎస్సీ కాలనీ-10, సన్నూరు పరిధిలోని సూర్యతండా-10, జింకురాంతండా(కేశవాపురం)-30, ఈదులకుంట తండా-11, బందన్‌పల్లి-20, రాగన్నగూడెం-15, గణేశ్‌కుంటతండా-15, ఊకల్ గ్రామంలోని ఎస్సీ కాలనీ-30, బురహాన్‌పల్లికి13 ఇండ్లను మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు. ఒక్కో డబుల్ బెడ్ రూం నిర్మాణానికి రూ.5.04లక్షల చొప్పున మొత్తంగా 659 ఇండ్లకు గానూ ప్రభుత్వం తాజా నిర్ణయంతో రూ.33.21కోట్లు వెచ్చించనున్నట్లు ఎర్రబెల్లి వివరించారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...