మౌలిక సదుపాయాలు కల్పించాలి


Wed,September 12, 2018 02:56 AM

- రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ
సంగెం : పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వరంగల్‌రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ అన్నారు. మండలంలోని కాట్రపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పోలింగ్‌కేంద్రాలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవోమాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, టాయిలెట్లు, వికలాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులను ఏర్పాటు చేయాలని సహాయక రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓటరు లిస్టులో ఉన్న అన్ని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్పులు, చేర్పులు ఉంటే సరిచేయాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు లిస్టులను అందుబాటులో ఉంచామని, ప్రజలు త మ పేర్లు చూసుకోవాలన్నారు. అందు లో తప్పులు ఉంటే సంబంధిత బీఎల్‌వోలకు తెలియజేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదలవుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ అల్లం రాజ్‌కుమార్, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...