అభ్యంతరాలుంటే చెప్పాలి..


Wed,September 12, 2018 02:56 AM

-25 వరకు ఓటర్ల జాబితా సవరణకు అవకాశం
-జిల్లా కలెక్టర్ ఎం హరిత
-రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంరూరల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 11 : ము సాయిదా ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ ఎం హరిత సూచించారు. మంగళవారం తన చాంబర్‌లో రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆమె సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాకి సంబంధించిన మార్పులు, చేర్పులు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. జిల్లాలో ఏ పార్టీకి ఎందరు ప్రతినిధులు ఉంటారో వారి పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, అడ్రస్‌ను బుధవారంలోగా ఇవ్వాలన్నారు. పోలిం గ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాను ప్రతీ పార్టీ వారికి పంపిస్తామన్నారు. ఓటరు జాబితాలోని వివరాలను పరిశీలించుకొని ఎలాంటి అభ్యంతరాలున్నా సంబంధిత బూత్‌స్థాయి అధికారికి లేదా సహాయ ఓటరు నమోదు అధికారికి, ఓటరు నమోదు అధికారికి తెలుపవచ్చన్నారు. అలాగే, పోలింగ్ స్ట్టేషన్లను కూడా పరిశీలించుకోవాలన్నారు. ఈ నెల 15 లేదా 16న ఈవీఎంలు వస్తాయని, రాగానే సమాచారం అందిస్తామన్నారు. ఈవీఎంలకు ఫస్ట్‌లెవల్ చెకింగ్ ఉంటుందని దానికి అన్ని పార్టీ ప్రతినిధులు హాజరుకావాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో హరిసింగ్, ఆర్డీవోలు మహేందర్‌జీ, కిషన్, రవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జే కుమార్, వీ రమణారెడ్డి, సీహెచ్ నాగయ్య, ఎం సారంగం, ఈ నాగేశ్వర్ పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...