ఎన్నికలకు సన్నద్ధం..!


Tue,September 11, 2018 02:24 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వేగం పుంజుకుంది. ముందస్తు ఎన్నికలను అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. జిల్లాలోని గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్‌ఏ నుంచి మొదలు కొని అన్ని శాఖల జిల్లా అధికారులు పనుల్లో నిమగ్న మయ్యారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంకేతాలు, సూచనలు అందుకున్న జిల్లా అధికార గణం జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్థన్నపేట నియోజక వర్గాల్లోని 401 గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లకు సంబంధించిన పర్యవేక్షణలు పరిశీలనలు పూర్తి చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు నియోజకవర్గాల్లో వర్థన్నపేట ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా నర్సంపేట, పరకాల నియో జకవర్గాలు జనరల్. వీటిల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం వీటిల్లో ఏడు లక్షల 18 వేల జనాభా ఉండగా ఇప్పటి వరకు మూడు నియోజక వర్గాల్లో 5,97,365 మంది ఓటర్లున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికప్పుడు జిల్లా సమాచారాన్ని అందజేస్తున్న అధికార యంత్రాంగం. వివిధ స్థాయిల్లో ఎన్నికల నిర్వాహణ అనుబంధ పనులను వేగిరంగా పూర్తిచేస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి హజరైన కలెక్టర్ ముండ్రాతి హరిత ఎప్పటికప్పుడు జిల్లాలోని రెవెన్యూతో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేస్తుంది. జిల్లా కేంద్రంలోని ఏనుమాముల మార్కెట్ లోని ఎన్నికల ఓట్ల లెక్కింపు, సామాగ్రిని భద్రపరిచే గోదాంలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లాలోని వరంగల్ రూరల్, నర్సంపేట, పరకాల ఆర్డీవోలు మహేందర్ జీ, రవి, కిషన్‌లు జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్( ఎన్నికల విభాగం)లు పోలింగ్ బూత్ స్ధాయిల్లో పరిశీలనలు చేస్తున్నారు. ఈసందర్భంగా బూత్‌లకు సంబంధించిన భవనాల్లో వెలుతురు, విద్యుత్ సరఫరా, మౌళిక వసతులు, వికలాంగులకు అవసరమైన ఫ్లాట్ ఫామ్ లు, గత ఎన్ని కల సం దర్భం గా బూత్‌లలో ఎదురైన ఇ బ్బందులు తి రిగి పున రా వృత్తం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అవసరమైన మరమ్మతు విషయాలను క్షే స్థాయిలో పరిశీలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో బూత్ ఏర్పాటు ఉన్న వాటి సంఖ్య వాటి స్థితి గతులు, కొత్తగా ఏమైనా బూత్‌లు ఏర్పాటు చేయాల్సిందా లేదా అనే ఆంశాలపై పూర్తి నివేదికను సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి చేరవేసే పనిలో వీరంతా నిమగ్నమై ఉన్నారు.

ముసాయిదా ప్రకటించిన అధికారులు
తెలంగాణ శాసనసభ రద్దు నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాకుండా 01 జనవరి 2018 అర్హత తేదీగల రెండో ప్రత్యేక ఓటరు జాబితా సంక్షిప్త సవరణ షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం సోమవారం జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించింది. మంగళవార నుంచి ఈనెల 25 వరకు ైక్లెమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని ముసాయిదా నోట్‌లో ప్రకటించింది. 15న శనివారం, 16వ తేదీ ఆదివారం రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించి ఓటర్ల జాబితాను చదివి విన్పిస్తారు. ఆతరువాత మరో సారి 04 ఆక్టోబర్ 2018 గురువారం అభ్యంతరాలు, ైక్లెమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరిస్తారు. 10 అక్టోబర్‌న తుది ఓటర్ల జాబితాకు తుదిరూపం ఇచ్చి తుది జాబితాను ప్రకటిస్తారు. ముసాయిదా ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాల పై సర్వత్రాచర్చ జరుగుతున్నది.

జిల్లాలో 5,97,365 మంది ఓటర్లు
శాసనసభ రద్దు నేపథ్యంలో తొమ్మిది నెలలు ముందుగావస్తున్న ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. శాసనసభ రద్దు కేంద్ర ఎన్నికల సంఘానికి తక్షణ సమాచారం అందటంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పనులకు అధికార గణానికి తగిన సూచనలు చేసి పనులకు పురమాయించిది. జిల్లాలో మూ డు రెవెన్యూ విజన్‌లు, 16 మండల రెవె న్యూ మండలా లుండగా 401 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో 5,97,365మంది ఓటర్లున్నట్లు అధికార యం త్రాంగం ప్రకటించింది. వీరిలో మహిళలు 2,98,903 మంది ఓటర్లు కాగా పురుషులు 2,98,903మంది ఓటర్లున్నారు. పరకాల నియోజకవర్గంలో 93,485 మంది పురుషులు, 95, 322మంది మహిళలు, 12 మంది ఇతరులున్నారు. వర్థన్నపేటలో 1,04,534 మంది మహిళలు 1,06,784 మంది పురుష ఓటర్లుండగా ఇతరులు ఒకరు ఉన్నారు. నర్సంపేట సెగ్మెంట్లో 93,634 మంది పురుషులు, 98,571మంది మహిళ ఓటర్లుండగా 22 మంది ఇతరులున్నారు. జిల్లాలో అధిక ఓటర్లు నియోజకవర్గం వర్థన్నపేట. తుది గడువు నాటికి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేగాకుండా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల్లో కూడా మార్పులు చేర్పులు, వాటి సంఖ్యను పెంచటం తగ్గించటం కూడా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...