పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవోలు


Tue,September 11, 2018 02:24 AM

ఖానాపురం/సంగెం, సెప్టెంబర్10: మండలంలోని ఖానాపురం,అశోక్‌నగర్, దబీర్‌పేట, చిలుకమ్మనగర్ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సోమవారం నర్సంపేట ఆర్డీవో రవి, తహసీల్దార్ మర్కాల రజనీరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు ఉన్నాయోనని పరిశీలించారు.అనంతరం ఆర్డీవో రవి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రాబో యే ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజులుగా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్‌ఐ రాజు,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సంగెం మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను వరంగల్ ఆర్‌డీవో మహేందర్‌జీ సందర్శించారు. మండలంలోని పల్లార్‌గూడ, మొండ్రాయి, నార్లవాయి, నల్లబెల్లి, చింతలపల్లి గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను ఆయన సందర్శించారు. పోలింగ్‌స్టేషన్లలో గదులు, కరెం టు, నీరు, తదితర విషయాలను ఆయన వెంట తహసీల్దార్ సత్యనారాయణ, వీఆర్‌వో, వీఆర్‌ఏలు ఉన్నారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
రాయపర్తి : రాష్ట్రంలో భవిష్యత్తులో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు మండలంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాల్సిందిగా తహసీల్దార్ వాసం రామ్మూర్తి కోరారు. మండలంలోని 39 గ్రామ పంచాయతీలు, శివారు గిరిజన తండాల్లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల స్థితిగతులను సోమవారం రెవెన్యూ యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, తాజా మాజీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్‌లు, రెవెన్యూ యంత్రాంగంతో ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలలో పోలింగ్ భూతులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ మహ్మద్ సుబానుద్దీన్, గిర్ధావర్ మల్లయ్య, వీఆర్‌వోలు ఉన్నారు.

నర్సంపేట రూరల్‌లో..
నర్సంపేట రూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సోమవారం తహసీల్దార్ లావుడ్య పూల్‌సింగ్‌చౌహాన్ పరిశీలించారు. మండలంలోని మహేశ్వరం, రాజపల్లి, రాజుపేట, లక్నెపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణను వేగ వంతం చేయాలని, తప్పు ఒప్పులను వెంటనే గుర్తించాలన్నారు. రానున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీటీ జి. వివేక్, ఆర్‌ఐ సాయికృష్ణ, ఎలక్షన్ డీటీ సంధ్యారాణి, వీఆర్వోలు, వీఆర్‌ఏలు తదితరులుఉన్నారు.

దామెరలో..
దామెర : మండలంలోని ఒగ్లాపూర్, ఊరుగొండ తదితర గ్రామాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్లను తహసీల్దార్ సరిత క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. ఒగ్లాపూర్‌లో పోలింగ్ బూత్‌లకు నంబర్లను వేయాలని, అదేవిధంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలైనన్ని సదుపాయాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీటీ హైమ, ఎస్‌వో హేమ, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

శాయంపేటలో..
శాయంపేట : మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ వెంకట్‌భాస్కర్ సోమవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుండటంతో మండల స్థాయి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మండలంలోని పెద్దకోడెపాక, కొ ప్పుల, గోవిందాపూర్, గంగిరేణిగూడెం గ్రామాల్లో పది పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఎక్కడైతే వసతులు సరిగ్గా లేవో వాటి వివరాలను నమూనా పత్రంలో నమోదు చేసి కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట ఎమ్మారై లావుడ్య హేమానాయక్, వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఉన్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...