పల్లెలు.. గులాబీ వనాలు..


Tue,September 11, 2018 02:24 AM

రాయపర్తి, సెప్టెంబర్ 10 : తెలంగాణలోని సకల వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు జనాలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, దీంతో రాష్ట్రంలోని మారుమూల పల్లెలన్నీ గులాబీ వనాలుగా మారుతున్నాయని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇటీవల ప్రత్యేక గ్రామ పంచాయతీగా రూపాంతరం చెందిన మండలంలోని గణేశ్‌కుంట తండాకు చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు ఎర్రబెల్లి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన పల్లెలన్నీ కేసీఆర్ పనితీరుకు ఫీదా అవుతున్నాయన్నారు. నిరుపేదల పక్షపాతిగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పాలకులకు అండగా నిలవాలన్న ఆంకాంక్షతోనే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ మునావత్ నర్సింహనాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మునావత్ రవినాయక్, మండల నాయకులు బిజ్జాల సోమనాథం, ఎం సుధాకర్‌నాయక్, మునావత్ రఘునాయక్, చత్రునాయక్, మోహన్‌నాయక్ పాల్గొన్నారు.

తండాలో కాంగ్రెస్ పార్టీకి బీటలు
నూతన గ్రామ పంచాయతీగా రూపొందిన గణేశ్ కుంట తండాలో కాంగ్రెస్ పార్టీకి బీటలు వారుతున్నాయి. రాగన్నగూడెం పంచాయతీ పరిధిలో గతంలో ఉన్న గణేశ్‌కుంట తండాను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని కోరుతూ తండావాసులు ఎన్నోసార్లు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు విన్నవించుకున్నారు. ఈ మేరకు తండాలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశారు. కానీ ఆ పార్టీ నేతలెవరూ వారి గోడును ఆలకించలేదు. దీంతో గిరిపుత్రుల ఆశయాలను నెరవేర్చిన గులాబీ జెండాను తమ గుండెల్లో దాచుకోవాలన్న లక్ష్యంతో తండావాసులంతా ఉద్యమ పార్టీ నీడన చేరారు. ఈ మేరకు తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గోపాల్, బిచ్యానాయక్, బలపనాయక్, రమేశ్‌నాయక్, వీరన్న, రవి, వెంకన్న, గుగులోతు రమేశ్, గోపాల్‌తో కలసి సుమారు 30 మంది గులాబీ వనంలో చేరినట్లు వివరించారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...